ద్రాక్ష పంటను పక్షి కన్ను తెగుల బెడద నుండి సంరక్షించే పద్ధతులు..!

భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో ద్రాక్ష పంట( grape crop ) అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది.

ద్రాక్ష పంటకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల ( pests )గురించి ముందుగానే తెలుసుకుంటే.

వీటి నుండి పంటను సంరక్షించుకుని ఆశించిన స్థాయిలో అధిక దిగుబడి పొందవచ్చు.ద్రాక్ష పంట సాగులో అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకే ఇవ్వాలి.

ద్రాక్ష పంట సాగుకు పొడి వాతావరణం ఉండి, ఉష్ణోగ్రతలు 15-30 సెంటిగ్రేడ్, వర్షపాతం 700-900 మి.మీ ఉంటే చాలా అనుకూలం.నేల యొక్క పీహెచ్ విలువ 6.5-7.5 ఉంటే అనుకూలం.నీటి వసతి బాగా ఉంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వేరు వచ్చిన కొమ్మ కత్తిరింపులను నాటుకోవాలి.

ఒకవేళ సమస్యాత్మక భూములలో అయితే ఈ సమస్యలను తట్టుకునే వేరు మూలాన్ని నాటి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో దానిపై వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో( wedge grafting method ) కావలసిన రకంతో అంటు కట్టుకోవాలి.లేదంటే అంటుకట్టిన మొక్కలనే నేరుగా నాటుకోవచ్చు.

Advertisement

ఒక్కొక్క గుంతలో 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల పశువుల ఎరువు, 10 గ్రాముల ఫోరేట్ వేసి గుంతలు మూసుకోవాలి.

ద్రాక్ష పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే పక్షి కన్ను తెగుళ్లు ఊహించని నష్టం కలిగిస్తాయి.ఈ పక్షి కన్ను తెగులు( Bird eye pest ) ఎల్సినో అంఫెలినా అనే శిలీంద్రం వల్ల సోకుతుంది.ద్రాక్ష మొక్క ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మధ్యలో బూడిద రంగులోకి మారి మచ్చలో కణజాలం ఎండిపోయి పడిపోతుంది.

గాలిలో తేమశాతం 80-95 ఉంటే ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.

ద్రాక్ష పంటలో కొమ్మ కత్తిరింపుల తర్వాత మొక్కలపై బోర్డాక్స్ మిశ్రమం ఒక శాతం పిచికారి చేయాలి.ఈ తెగుళ్లను గుర్తించిన తర్వాత ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల మాంకోజెబ్ 75WP లేదా ఒక లీటరు నీటిలో 1.5 గ్రాముల డైమితోమార్ఫ్ తో పిచికారి చేయాలి.వారం రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేసి ఈ తెగుళ్లను పూర్తిగా అరికట్టాలి.

బతికి ఉన్న పీతను కరకరా నమిలేసి తిన్న మహిళ.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు