వంగ సాగును ఆశించే హెలికోవెర్పా గొంగళి పురుగుల నుండి సంరక్షించే పద్ధతులు..!

వంగ సాగును( eggplant ) తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో హెలికోవెర్పా గొంగళి పురుగులు( Caterpillars ) కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉండి దాదాపుగా నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.

ఈ గంగోలిపురుగులు వంగ మొక్క మొగ్గలు, కాయలు, ఆకులను రంధ్రాలు చేస్తూ తింటూ ఉంటాయి.ఈ పురుగుల మల పదార్థం ఆకులపై గుర్తించవచ్చు.

ఈ పురుగుల వల్ల సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

మొక్కలు పూత, పిందే దశలో ఉన్నప్పుడు మొక్కలపై తెల్లని రంగు నుండి గోధుమ రంగు గుడ్లు( Brown eggs ) గుంపులు గుంపులుగా గుర్తించవచ్చు.ఈ పురుగులు రంద్రాలు చేసిన వంగ కాయలు అమ్మడానికి పనికిరావు.కాబట్టి ఈ పురుగులు పంటను ఆశించకుండా, ఒకవేళ ఆశిస్తే వెంటనే సంరక్షక చర్యలు పాటించి ఈ పురుగులను నివారించాలి.

Advertisement

తెగులు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలను మాత్రమే పొలంలో నాటుకోవాలి.మొక్కల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా ఉండే విధంగా కాస్త దూరంగా నాటుకోవాలి.పంట పొలంలో పక్షులు వాడడానికి అక్కడక్కడ మేరీ గోల్డ్ మొక్కలు( Mary Gold plants ) నాటుకోవాలి.

ఈ పురుగుల ఉనికి గుర్తించేందుకు లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.

మొక్కలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మొక్కలపై గుడ్లు, దెబ్బతిన్న పువ్వులు, పండు మొగ్గలు, దెబ్బతిన్న కాయలను గుర్తించి పంట నుండి వేరు చేసేయాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి.పంట మార్పిడి చాలా అవసరం.ఇక ఈ పురుగుల నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల క్లోరో ఫెరిఫోస్ కలిపి పంటకు పిచికారి చేయాలి.ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే ఫ్లూబెండయ మైడ్ 2.5 మిల్లి లీటర్లను ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.15 రోజుల వ్యవధిలో ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసి ఈ పురుగులను అరికట్టాలి.అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Advertisement

తాజా వార్తలు