కొత్తిమీర పంటను మాగుడు తెగుళ్లు నుండి సంరక్షించే పద్ధతులు..!

కొత్తిమీర( Coriande )ను అన్ని రకాల వంటకాలలో ఉపయోగిస్తారు.వేసవికాలం వచ్చిందంటే కొత్తిమీరకు గిరాకీ చాలా ఎక్కువ.

ఎందుకంటే వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కొత్తిమీరలో మొలక శాతం తక్కువగా ఉండడంతో ఆకుల పెరుగుదల సరిగా ఉండదు.మరి వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే కొత్తిమీర సాగులో పాటించాల్సిన మెళుకువలు ఏమిటో తెలుసుకుందాం.

Methods Of Protecting The Coriander Crop From Magdu Pests , Coriander Cultivati

కొత్తిమీరలో చాలా రకాలే ఉన్నాయి.వేసవికాలంలో అధిక దిగుబడులు ఇచ్చే రకాల విషయానికి వస్తే.సింధు, స్వాతి, సాధన, సుధా రకాలు అధిక దిగుబడి ఇస్తాయి.

వేసవికాలంలో మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి సాగుకు అధిక విత్తనాలు అవసరం.ఒక సెంటు నారుమడికి 250 గ్రాముల విత్తనాలు అవసరం.

Advertisement
Methods Of Protecting The Coriander Crop From Magdu Pests , Coriander Cultivati

ఈ విత్తనాలు ముందుగా ఆ విత్తన శుద్ధి( Seed treatment ) చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను ఒక గ్రాము కార్బండిజమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

Methods Of Protecting The Coriander Crop From Magdu Pests , Coriander Cultivati

వేసవికాలంలో పంట నష్టం జరగకుండా అధిక దిగుబడి పొందాలంటే ఎత్తైన నారుమడులను ఏర్పాటు చేసుకొని సాగు చేపట్టాలి.మూడు అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల ఎత్తు, తగినంత పొడవు ఉండే చిన్న మడులను ఏర్పాటు చేసుకొని సాగు చేపట్టాలి.ముఖ్యంగా వేసవికాలంలో ఒక సెంటీమీటర్ లోతులో పడేటట్లు విత్తనాలు విత్తుకుంటే మొలక శాతం తగ్గదు.

ఒక సెంటు నారుమడికి 350 గ్రాముల యూరియా, ఒక కిలో సూపర్ ఫాస్పేట్, 150 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు( Potash fertilizers ) అందించాలి.పశువుల ఎరువుతో పాటు వానపాముల ఎరువు అందిస్తే భూమి గుల్లబారి కోతిమీర మొక్క బాగా ఏపుగా పెరిగే అవకాశం ఉంది.

కొత్తిమీర పంటకు మాగుడు తెగుళ్లు ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.ఈ తెగుళ్ల నివారణకు ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ను కలిపి పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు