చీడపీడల నుండి పెరటి తోటలను సంరక్షించే కషాయాల తయారీ విధానాలు..!

ఇటీవలే కాలంలో రసాయనిక ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది.అధిక దిగుబడి, చీడపీడల బెడద నివారణ కోసం రకరకాల రసాయనిక ఎరువులను పిచికారి చేస్తుంటారు.

పంట పొలాల్లోనే కాక మిద్దె తోటలలో, ఇంటి చుట్టు వేసుకునే పెరటి తోటలలో కూడా రసాయనిక ఎరువుల వాడకం, పిచికారి చేస్తున్నారు.ఒకవేళ చీడపీడల ఉధృతి బాగా పెరిగితే మొక్కలను కూడా తొలగించవలసి వస్తుంది.

వ్యవసాయ క్షేత్ర నిపుణులు ఏమంటున్నారంటే హానికరమైన రసాయనిక మందుల వాడకం బదులుగా ఇంట్లోనే కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల పెట్టుబడి ఆదా అవడంతో పాటు నాణ్యమైన పంట పొందవచ్చు.పెరటి తోటలలో, మిద్దె తోటలలో కాయ తొలుచు పురుగుల బెడద నివారణ కోసం పచ్చిమిరప, వెల్లుల్లి కషాయం( Garlic infusion ) చాలా బాగా ఉపయోగపడుతుంది.100 గ్రాముల వెల్లుల్లి రోకలిలో మెత్తగా నూరి, అందులో 50 మిల్లీలీటర్ల కిరోషన్ కలిపి రాత్రంతా నానబెట్టాలి.ఒక అరకిలో కాడలు తీసిన పచ్చిమిర్చిని బాగా నూరి, ఓ లీటర్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం ఈ రెండు మిశ్రమాలను కలిపి అందులో 20 గ్రాముల సబ్బు పొడి( soap powder ), పది లీటర్ల నీరు పోసి బాగా కలిపి గుడ్డ సహాయంతో ఆ ద్రావణాన్ని వడగట్టాలి.ఈ ద్రావణాన్ని మొక్క బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి.మొక్కలకు తెగుళ్లు( Pests of plants ), శిలీంద్రాలు ఆశించినప్పుడు పశువుల పేడ, మూత్రం, ఇంగువతో కషాయం తయారు చేసుకుని ఉపయోగించాలి.

Advertisement

కిలో ఆవు పేడలో, లీటరు నీరు, లీటర్ ఆవు మూత్రం వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని అప్పుడప్పుడు కలుపుతూ నాలుగు రోజులపాటు మురగబెట్టాలి.తర్వాత అందులో 10 లీటర్ల నీరు 50 గ్రాముల ఇంగువ కలిపి వడగట్టిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేయాలి.

ఇలా ఇంట్లో కషాయాలను తయారు చేసుకుని ఎప్పటికప్పుడు మొక్కలపై పిచికారి చేయడం వల్ల నాణ్యమైన పంట పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు