హోరాహోరీగా తలపడిన మగపులులు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!

ఆడతోడు లేనిదే మగవారి జీవితం సార్థకం కాదని పెద్దలు చెబుతుంటారు.ఆజన్మ బ్రహ్మచారులుగా ఉన్న వారు సైతం పెళ్లి చేసుకోవాలని ఇతరులకు సూచిస్తుంటారు.

ఇక ప్రియురాలు లేదా భార్య కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తారు.ఇటీవలే తన భార్య మీద జోక్ చేశాడని హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఏకంగా వ్యాఖ్యాత చెంప చెళ్లుమనిపించాడు.

ఇదేమీ పెద్ద విషయం కాదని, ఆడ వారి కోసం ఏకంగా సామ్రాజ్యాలే కూలిపోయిన ఘటనలు చరిత్రలో ఉంటాయని కొందరు గుర్తు చేస్తున్నారు.ఇది మనుషులలోనే కాకుండా జంతువులలో కూడా కనిపిస్తుంటుంది.

తాజాగా ఓ ఆడపులి కోసం రెండు మగపులులు అడవిలో హోరాహోరీగా తలపడ్డాయి.ఆ వీడియో చూసిన వారికి ఒళ్లు జలదరిస్తోంది.

Advertisement

దాని గురించి తెలుసుకుందాం.ఇటీవల కొందరు అడవిలో జంతువులను నేరుగా చూసేందుకు వైల్డ్ లైఫ్ సఫారీ టూర్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో రెండు పులులు తమ వాహనానికి దగ్గరగా రోడ్డు దాటుతున్నాయి.దీంతో వారు తమ వాహనం ఆపేసి, వాటిని వీడియో తీయడం ప్రారంభించారు.

ఇంతలో రోడ్డుకు అవతల ఓ ఆడపులి ఉంది.దానిని చూసిన ఈ రెండు మగపులులు ఒక్కసారిగా ఒకదానిపై మరొకటి భీకరంగా తలపడ్డాయి.

తమ తమ బలం మేర పంజా విసురుతూ దాడులు చేసుకున్నాయి.అవి అలా ఒకదానిపై మరొకటి విరుచుకుపడడం చూసి పర్యాటకులు ఒకింత ఆందోళన చెందారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

చివరికి ఓ పులి అలసిపోయి తన పోరాటం విరమించుకుంది.దీంతో ఈ భీకర పోరు ఆగిపోయింది.

Advertisement

ఇదంతా తన వల్లే అని తెలిసిన ఆడపులి ఓ పక్కగా నిలబడి వీటి పోరాటం అలా చూస్తూ ఉండిపోయింది.ఇది నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ఈ పులుల పోరాటాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు.దీంతో ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.ఈ పురుల భీకర పోరు గగుర్పాటుకు గురి చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు