NTR Vinodhaya Sitham : ఎన్టీఆర్ కోసం మెహర్ రమేష్ మళ్ళీ ట్రై చేస్తున్నాడా.. మరో 'శక్తి'కి ఛాన్స్ ఇస్తాడా?

ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.

అయితే ఎంత టాలెంట్ ఉన్న కూడా వారి సినిమాల విషయంలో మాత్రం అది ఎంత మాత్రం కలిసి రాదు.

అలాంటి డైరెక్టర్ల లిస్టులో ముందు వరుసలో ఉంటాడు మెహర్ రమేష్.ఈయన చేసిన సినిమాలు అన్ని అట్టర్ ప్లాప్ అయినవే ఉన్నాయి.

ఈయనకు హీరోలను మాస్ హీరోలుగా మలచడంలో టాలెంట్ ఉంది కానీ చేసిన సినిమాలు అన్ని బెడిసి కొడుతున్నాయి.ఈ క్రమంలోనే ఈయన స్టార్ డైరెక్టర్ కాలేకపోయారు.

ఈయన దర్శకుడిగా మారడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఈయనపై ఉన్న నమ్మకంతో కంత్రి సినిమాకు అవకాశం ఇచ్చారు.

Advertisement

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈ సినిమా ప్లాప్ తో ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

అయినా కూడా ఎన్టీఆర్ నమ్మి శక్తి సినిమాకు అవకాశం ఇచ్చాడు.అయితే ఇది కంత్రి సినిమా కంటే దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.

ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎన్టీఆర్ చాలా నమ్మారు.కానీ ఈ నమ్మకం ఒమ్ము అయ్యింది.

ఇలా తారక్ రెండుసార్లు ఈయనకు అవకాశం ఇవ్వడానికి కారణం మెహర్ లోని టాలెంట్ అనే చెప్పాలి.విజువల్ గా సినిమాను హైలెట్ చేయగల గొప్ప లక్షణం ఈయనకు ఉంది.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

ఇక అదే నమ్మకంతో మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

Advertisement

లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ సగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని మెహర్ రమేష్ పట్టుదలగా ఉన్నారు.ఇక ఈయన తాజాగా యంగ్ టైగర్ తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

తారక్ పాన్ ఇండియా క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మెహర్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడని టాక్.మరి తారక్ ఈ మూమెంట్ లో ఇతడికి అవకాశం ఇవ్వడం అనేది అసాధ్యం అని కొంత మంది చెబుతున్న మాట.చూడాలి ఇతడి ప్రయత్నాలు ఎంత వరకు వెళతాయో.