నా వల్ల కాలేదు.. నా కొడుకు ఆ కలను నెరవేర్చాడు: చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతున్నాడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఇలా ఉంటే తాజాగా ముంబైలో గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.పాన్ ఇండియా స్టార్ అనే పదానికి నిర్వచనం చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.చాలా కాలం కిందట ప్రతి బంద్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను.

ఆపై పలు సినిమాలు చేశాను.అయితే ఆ సమయంలో ఇక్కడ నేషనల్ ఫిలిం, రీజినల్ ఫిలిం అనే తేడా ఉంది అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను.

ఆ తర్వాత తెలుగు సినిమాలలో బిజీ అయిపోయాను.తెలుగు సినిమాలపై దృష్టిని పెట్టి హిందీ సినీ పరిశ్రమకు దూరం గా వెళ్లిపోయాను.

కానీ నేను కోరుకునేది ఒక్కటే ఇక్కడ ఒకే ఒక సినిమా ఉండాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అది ఇండియన్ సినిమా అయి ఉండాలి.ప్రాంతీయ సినిమా అన్న భేదం ఉండకూడదు ఆ రోజు కచ్చితంగా రావాలని బలంగానే కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు చిరంజీవి.అనంతరం రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ని హిందీ ప్రేక్షకులు ఆదరించారని, ఒకప్పుడు నన్ను ఆదరించని హిందీ ప్రేక్షకులే ఇప్పుడు రామ్ చరణ్ ఆదరిస్తుంటే ఒక తండ్రిగా నేను చాలా ఆనంద పడుతున్నాను.రామ్ చరణ్ ద్వారా నా కల నెరవేరింది అని తెలిపారు చిరంజీవి.

ఇప్పుడు తాను ఒక ఇండియన్ యాక్టర్ అని చెప్పుకోడానికి చాలా గర్వపడుతున్నాను అని తెలిపారు చిరంజీవి.

తాజా వార్తలు