ప్రజారాజ్యం పార్టీ విలీనంపై చిరంజీవి స్పందన ఇదే.. బాగుందని చెబుతూ?

మెగాస్టార్ చిరంజీవి సీఎం కావాలని మెగా అభిమానులలో చాలామంది కోరుకున్నారు.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

కొన్నిరోజుల క్రితం జనసేనకు పరోక్షంగా మద్దతు ప్రకటించిన చిరంజీవి తాజాగా ప్రజారాజ్యం పార్టీ గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంచి రోల్స్ వస్తే ఇతర భాషల్లో నటించడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని చిరంజీవి తెలిపారు.

తాను హిట్ వచ్చిందని సంతోషించనని ఫ్లాప్ వచ్చిందని కృంగిపోనని చిరంజీవి చెప్పుకొచ్చారు.సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అది నా ఒక్కడిదే అని అనుకోనని చిరంజీవి కామెంట్లు చేశారు.

మూస కథల నుంచి బయటపడాలనే ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే ఆ తరహా ప్రయత్నం నేను చేయలేదని గాడ్ ఫాదర్ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని ఆయన అన్నారు.గతంలో నేను రీమేక్ చేసిన ఘరానా మొగుడు, ఠాగూర్ సినిమాలు మాతృకను మించి ఉన్నాయని చిరంజీవి వెల్లడించడం గమనార్హం.రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల ప్రస్తుతం బాగానే ఉన్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ప్రజారాజ్యం కొనసాగి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి పరిమితం అయ్యేవాడినని చిరంజీవి అన్నారు.

ప్రస్తుతం నన్ను నటుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదరిస్తున్నారని చిరంజీవి వెల్లడించారు.ప్రస్తుతం నేను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజ్లలకు దగ్గరగా ఉంటున్నానని ప్రస్తుతం పార్టీ లేకపోవడమే బెటర్ అని అనిపిస్తోందని చిరంజీవి చెప్పుకొచ్చారు.మెగాస్టార్ చిరంజీవి రాబోయే రోజుల్లో ఎలాంటి కథలను ఎంచుకుంటారో చూడాలి.68 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఎనర్జీతో చిరంజీవి వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు