నాలుగో సారి స్క్రీన్ పై సందడి చేయనున్న మెగాస్టార్, రామ్ చరణ్

టాలీవుడ్ మెగా ఫ్యామిలీ హీరోలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

ఓ విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ని ఇప్పుడు మెగా హీరోలు రూల్ చేస్తున్నారు అని చెప్పాలి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కంప్లీట్ చేసుకొని కొరటాల సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.ఇక మెగాస్టార్ వారసుడుగా తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకొని నటుడుగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకొని మెగాస్టార్ ని వారసుడుని అనిపించుకున్నాడు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మెగా ఫాన్స్ కి పూనకాలే అని చెప్పాలి.ఇప్పటికే మెగాస్టార్, రామ్ చరణ్ మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

మొదటి సారి మగదీర సినిమాలో స్టెప్పులు వేసిన చిరంజీవి తర్వాత బ్రూస్లీ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా కనిపించారు.ఇక చివరిగా మెగాస్టార్ ఖైది 150 సినిమాలో రామ్ చరణ్ ఒక పాటలో తలుక్కుమన్నాడు.

Advertisement

మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ తెరపై మరో సారి సందడి చేయబోతుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఈ సారి ఏదో అలా వచ్చి, కనిపించి పోకుండా స్టొరీలో చాలా కీలకమైన పాత్ర అనే టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు ఈ వార్త బయటకి రావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement