తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టి అనంతరం తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఇలా సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు.
ఇలా రామ్ చరణ్ ఇప్పటికే పలు బిజినెస్లను నిర్వహిస్తూ వాటిని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు.అయితే తాజాగా ఈయన తన బిజినెస్ లో మరో మెట్టు పైకి ఎక్కినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఐపీఎల్(IPL) లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే మ్యాచ్ ఆడటం కోసం కాదు.ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేయడానికి మెగా పవర్ స్టార్ సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు ఈ విధమైనటువంటి బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ఈ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెప్రజెంట్ చేస్తూ ఒక్క ఐపీఎల్ టీమ్ కూడా లేదు.తెలంగాణలో సన్ రైజెస్ హైదరాబాద్ లా ఏపీలో కూడా ఒక టీమ్ ను ఐపీఎల్ లోకి తీసుకురావాలని రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని వచ్చే ఏడాది రామ్ చరణ్ ప్రాంచైజీ నుంచి ఒక కొత్త టీం ఐపీఎల్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ టీంకు పేరు కూడా ఫిక్స్ చేశారని సమాచారం.ఈ టీమ్ కి వైజాగ్ వారియర్స్ (Vizag Warriers)అనే పేరును కూడా పెట్టారని తెలుస్తోంది.ఇలా ఈ టీం ద్వారా రామ్ చరణ్ ( Ram Charan )కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ముందుకు వెళ్లారని తెలుస్తోంది.
అయితేఇందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలబడుతున్నట్లు సమాచారం.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy