నిహారిక పరిచయం ఏమైంది?

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి కేవలం హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు.మొదటి సారి హీరోయిన్‌గా నాగబాబు కూతురు నిహారిక ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.

టీవీ9 మరియు మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించబోతున్న చిత్రంలో నిహారిక హీరోయిన్‌గా నటించబోతుంది.ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభానికి ముందు మెగా ఫ్యాన్స్‌కు నిహారిక పరిచయ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని మధుర శ్రీధర్‌ భావించాడు.

అందుకోసం నాగబాబు వద్ద అనుమతి కూడా తీసుకున్నాడు.అయితే నిహారిక ఎంట్రీపై మెగా హీరోల్లో కొందరు ఆసక్తి కనబర్చడం లేదు.

దాంతో ఈ సమయంలో పరిచయ కార్యక్రమం వద్దని నాగబాబు సున్నితంగా మధుర శ్రీధర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.దాంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నాడు.

Advertisement

‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించబోతున్న చిత్రంలో నిహారిక హీరోయిన్‌గా తెరకెక్కబోతుంది.రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్‌ మాదిరిగానే నిహారిక గ్లామర్‌ను ఒలకబోయడంతో పాటు అన్ని రకాల సీన్స్‌ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

మెగా హీరోయిన్‌ అయినంత మాత్రాన నిహారిక పద్దతిగా ఈ చిత్రంలో కనిపించబోవడం లేదు అని దర్శకుడు చెబుతున్నాడు.అందుకే మెగా వర్గాల వారు కొందరు నిహారిక ఎంట్రీని వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Advertisement