వరుణ్‌, లావణ్య ల పెళ్లి రిసెప్షన్‌ ఖర్చు ఎంతో తెలుసా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు.

చాలా మంది ప్రేమించి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్లడం లేదు.

కానీ వరుణ్‌ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలు మాత్రం తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్లారు.పెళ్లికి ఇరు వైపుల పెద్దలను ఒప్పించారు.

అంతే కాకుండా తమ ప్రేమ విషయం రోడ్డున పడకుండా చాలా జాగ్రత్తగా హుందాగా వ్యవహరించారు.ఇద్దరూ కూడా ప్రేమ విషయం ను చాలా రహస్యంగా ఉంచారు.

ఎక్కడ కూడా చిల్లరగా వ్యవహరించకుండా నిశ్చితార్థం వరకు దాస్తూ వచ్చారు.ఎట్టకేలకు వారి వివాహం జరిగింది.

Advertisement

వరుణ్‌ కి అత్యంత ఇష్టమైన ఇటలీ( Italy ) లో వీరి వివాహం జరిగింది.యూరప్‌< ప్రపంచం లో అత్యంత అందమైన ప్రదేశాలు కలిగిన ప్రాంతం.

అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలని భావించిన వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులను ఒప్పించి అక్కడ పెళ్లి కి రెడీ అయ్యాడు.అక్కడ పెళ్లికి భారీ ఎత్తున ఖర్చు అయింది.

పెళ్లి కోసం హాజరు అయిన గెస్ట్‌ లు అందరికి కూడా వరుణ్ తేజ్ అప్‌ అండ్‌ డౌన్ టికెట్లను బుక్ చేయడం జరిగింది.

అంతే కాకుండా వారు బస చేసేందుకు గాను అక్కడ అత్యంత ఖరీదైన విల్లాలు మరియు హోటల్స్ లో రూమ్స్ ను తీసుకున్నాడు.అందుకు కూడా వరుణ్ తేజ్ భారీ ఎత్తున ఖర్చు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక హైదరాబాద్( Hyderabad ) లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేశాడు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖులు హాజరు అవ్వడంతో అద్భుతమైన డైనింగ్‌ ను ఏర్పాటు చేయించాడట.అంతకు కూడా మెగా ప్రిన్స్ భారీగా ఖర్చు చేశాడు అంటూ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

Advertisement

కాస్ట్యూమ్స్ మొదలుకుని రిసెప్షన్ వరకు వరుణ్‌ తేజ్ పెళ్లి కోసం దాదాపుగా అయిదు నుంచి ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి వేడుక అంటే ఆ మాత్రం ఖర్చు చేయకుంటే ఎలా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.కొందరు మాత్రం పది కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి ఉంటారు అంటున్నారు.

అసలు మొత్తం ఎంత అనేది వరుణ్ తేజ్ నోరు విప్పితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అయితే పెళ్లి కోసం పెట్టిన ఖర్చు మొత్తం పెళ్లి వీడియోను ఓటీటీకి ఇస్తే ఆ డబ్బు మొత్తం రిటర్న్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరి మెగా ప్రిన్స్ ఆ పని చేస్తాడా అనేది చూడాలి.

తాజా వార్తలు