ఇది చేతిరాతన.. ఇంకా ఏదో ప్రింట్ అవుట్ అనుకున్నామే!

ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం స్క్రీన్స్, కీబోర్డులు ఆధారంగా పని చేస్తున్న కాలంలో చేతితో రాసే అలవాటు చాలావరకు తగ్గిపోతోంది.

అయితే, ఓ నేపాలీ యువతి తన అద్భుతమైన చేతిరాతతో( Handwriting ) ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

ఆ అమ్మాయి రాసిన దానిని చూసి ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత ఆమెదే అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ యువతి పేరు ప్రకృతి మల్లా.

( Prakriti Malla ) నేపాల్‌కు( Nepal ) చెందిన ఈ అమ్మాయి తన చేతిరాత ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

కేవలం 16 ఏళ్ల వయస్సులోనే, ప్రకృతి మల్లా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఘనత సాధించింది.ఆమె ఒక హోంవర్క్ అసైన్‌మెంట్‌లో రాసిన పేజీ సోషల్ మీడియాలో వైరల్ అవడం ద్వారా ఆమె పేరు ఇంటింటికీ చేరింది.ఆ పేజీలో కనిపించిన ఆమె చేతిరాత ఎంతో ఆకర్షణీయంగా, శుభ్రముగా, కళాత్మకంగా ఉండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

Advertisement

సాధారణంగా అనిపించే స్కూల్ హోంవర్క్ పేజీ ఒక కళా ప్రతిభావంతురాలికి వేదికగా మారింది.ప్రకృతి మల్లా జనరేషన్ Zకి చెందిన యువతి.ఈ తరం యువత ఎక్కువగా డిజిటల్ పరికరాలపై ఆధారపడతారు.

రాయడం కన్నా టైపింగ్‌ పై ఎక్కువ దృష్టి పెట్టే కాలంలో, ప్రకృతి మాత్రం తన చేతిరాతను నైపుణ్యంగా అభివృద్ధి చేసుకుంది.ఆమె రాతలో కనిపించే డిటైల్స్, నిఖార్సైన స్పష్టత చూస్తే అది కేవలం రాత మాత్రమే కాదు.

ఒక కళ అన్న భావన కలుగుతుంది.చేతిరాత ఇప్పటికీ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను వ్యక్తపరిచే శక్తివంతమైన సాధనం అని ఆమె నిరూపించింది.

ప్రకృతి నేపాల్‌ లోని బీరేంద్ర సైనిక్ ఆవాసియ మహావిద్యాలయ అనే పాఠశాలలో చదువుతుంది.అక్కడే ఆమె అద్భుతమైన చేతిరాతకు మొదటి గుర్తింపు వచ్చింది.స్కూల్ అసైన్‌మెంట్‌లో ఆమె రాసిన ఇంగ్లీష్ పేజీ అంతా చూస్తూ మంత్రముగ్ధులయ్యారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

ఆమె స్కూల్ ఆ రాతను గుర్తించి ప్రోత్సహించింది, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యేలా మారింది.ప్రకృతి ప్రతిభ అక్కడితో ఆగిపోలేదు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE ) 51వ స్పిరిట్ ఆఫ్ ది యూనియన్ వేడుకల సందర్భంగా.

Advertisement

ప్రకృతి తన చేతిరాతతో రాసిన అభినందన లేఖను యూఏఈ నాయకత్వానికి పంపింది.ఆమె స్వయంగా ఖాట్మండులోని UAE ఎంబసీకి వెళ్లి ఆ లేఖను అందజేసింది.

లేఖలో కనిపించిన రాతకళను చూసిన ఎంబసీ అధికారులు ఎంతగానో మెచ్చుకుని, సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందించారు.ప్రకృతి ప్రతిభకు నేపాల్ ప్రభుత్వం, నేపాలీ సాయుధ పోలీసు దళం నుంచి గౌరవాలు అందాయి.

ఆమె చేతిరాత కేవలం ఒక వ్యక్తిగత నైపుణ్యంగా కాకుండా, నేపాల్ దేశానికి గర్వకారణంగా మారింది.అంతర్జాతీయంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ యువతిని నెటిజన్లు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు.

ఈ డిజిటల్ యుగంలో కూడా అందమైన, నైపుణ్యంతో కూడిన చేతిరాతకు ఎంతగానో విలువ ఉందని ప్రకృతి మల్లా నిరూపించింది.ఆమె కథ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

కళ, కృషి, నిబద్ధత కలిస్తే ఎంతదూరమైనా వెళ్ళొచ్చని ఈ యువతి విజయగాథ చెబుతోంది.

తాజా వార్తలు