తన సినీ కెరీర్ లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించిన మీనా(meena) అలనాటి స్టార్ హీరోలందరికీ జోడీగా నటించడంతో పాటు సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
మీనా తన భర్త చనిపోవడం వల్ల కొంతకాలం పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న మీనా ఇప్పుడిప్పుడే షూటింగ్ లతో బిజీ అవుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్(hrithik roshan) అంటే తనకు క్రష్ అని ఆమె కామెంట్ చేశారు.
హృతిక్ రోషన్ పెళ్లిరోజున నా హృదయం బద్దలైందని మీనా కామెంట్ చేశారు.తాను హృతిక్ రోషన్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని మా అమ్మతో కూడా నేను అదే విషయాన్ని చెప్పానని మీనా అన్నారు.
హృతిక్ రోషన్ ను నేను చాలా ప్రేమించానని ఆమె వెల్లడించడం గమనార్హం.
హృతిక్ రోషన్ పెళ్లి జరిగే సమయానికి నాకు ఇంకా పెళ్లి కాలేదని హృతిక్ కు పెళ్లి(hrithik roshan wedding) జరిగిన రోజున నా హార్ట్ బ్రేక్ అయిందని ఆమె అభిప్రాయపడ్డారు.హృతిక్ ను మీనా ఇంతలా అభిమానించేదని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.మీనా లాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అంటే హృతిక్ రోషన్ లక్కీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మీనా త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.
మీనా రెమ్యునరేషన్ సైతం భారీగానే ఉందని తెలుస్తోంది.ఇతర సీనియర్ స్టార్ హీరోయిన్లకు సమానంగా మీనా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.మీనా సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మీనాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.అభినయ ప్రధాన పాత్రల్లో మీనాకు అవకాశాలు పెరుగుతుండటం గమనార్హం.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy