భర్త మరణం తర్వాత తొలిసారి కెమెరా ముందుకు నటి మీనా?

టాలీవుడ్ సీనియర్ నటి మీనా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీ అయ్యారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మీనా జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

మీనా భర్త విద్యాసాగర్ హఠాత్మరణం తనని ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి.అయితే ఇలా తన భర్త మృతి చెందడంతో తీవ్ర శోకసంద్రంలోకి మునిగిపోయిన మీనా తనకు తాను ధైర్యం తెచ్చుకొని తిరిగి తాను కమిట్ అయిన సినిమా షూటింగులకు హాజరవుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మీనా ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా మీనా షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే షూటింగ్లో పాల్గొన్నటువంటి మీనాను ప్రముఖ కమెడియన్ భార్య జుబేదా తనని షూటింగ్ లొకేషన్లో కలుసుకున్నారు.జులై 19వ తేదీ నటకిరీటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ఆయనకు పుట్టినరోజు వేడుక చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా భార్య జుబేదా కూడా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఆమె మీనాను కలిసి తనతో ముచ్చటించారు.ఇకపోతే మీనాని తాను మొదటిసారి కలుసుకున్న ఫోటోని చూపించి తాను ఏ సినిమా టైంలో కలుసుకున్నారో వివరించారు.

ఈ విధంగా జుబేదా మీనా గారితో మాట్లాడుతూ చేసిన ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది.ఇలా భర్త మరణం తర్వాత మొదటిసారి మీనాను చూడడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మీరు ఇలా షూటింగ్లో పాల్గొని తొందరగా మీ బాధ నుంచి బయటపడాలి అంటూ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు