మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వైద్యులు ప్రీతి కోలుకుంటోందని అంటున్నారు.

అలా ఏమీ కనిపించడం లేదని తండ్రి నరేందర్ వాపోయారు.హార్ట్ ఫంక్షన్ సరిగా లేదని చెప్పారు.

ప్రీతి ఆరోగ్యం మెరుగు పడుతుందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.అంతేకాకుండా ప్రీతి ఘటనపై స్పెషల్ కమిటీ వేయాలని బంధువులు కోరుతున్నారు.

ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?

తాజా వార్తలు