అలీ తీస్తే సూపర్ హిట్.. వెంకటేష్ తీస్తే అట్టర్‌ఫ్లాప్.. ఏ మూవీనో తెలిస్తే..?

1994లో వచ్చిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ "యమలీల" ( Yamaleela )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.

V.

కృష్ణా రెడ్డి ( S.V.Krishna Reddy )రచించి, దర్శకత్వం వహించిన ఈ మూవీలో అలీ( Ali ) హీరో.ఈ సినిమాకి ముందు వరకు ఇతడు కమెడియన్‌గానే కొనసాగాడు.అలాంటి హాస్యనటుడిలో హీరోని చూశాడు కృష్ణారెడ్డి.

"నేను నిన్ను హీరోని చేస్తానోయ్" అన్నప్పుడు అలీ కూడా ఆ మాటలను నమ్మలేకపోయాడు.కానీ హీరోగా అవకాశం ఇవ్వడం, హీరోగా చేసిన ఫస్ట్ మూవీనే అఖండ విజయం సాధించడం అతనికి ఎంతో సంతోషాన్నిచ్చాయి.

Mayalodu Movie Flop In Bollywood , Bollywood , Mayalodu Movie, Yamaleela , S.v.
Advertisement
Mayalodu Movie Flop In Bollywood , Bollywood , Mayalodu Movie, Yamaleela , S.V.

ఇందులో ఇంద్రజ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎ.వి.ఎస్, హనుమంత రావు నటించి ఎంతగానో మెప్పించారు.ఈ మూవీ అంత పెద్ద హిట్ కావడంతో డి.రామా నాయుడు ఆశ్చర్యపోయారు.

ఈ కథ కూడా ఆయన బాగా నచ్చింది.అందుకే వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారు.

అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.మురళీ మోహనరావు దర్శకుడిగా హిందీలో తక్‌దీర్‌వాలా( Takdeerwala ) (1995) మూవీ చేశారు.

ఈ హిందీ యమలీల రీమేక్‌లో వెంకటేష్, రవీనా టాండన్ ( Venkatesh, Raveena Tandon )నటించారు.ఆనంద్-మిలింద్ మ్యూజిక్ అందించారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Mayalodu Movie Flop In Bollywood , Bollywood , Mayalodu Movie, Yamaleela , S.v.
Advertisement

ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు డబ్బులను వసూలు చేస్తుందని రామానాయుడు అనుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ ఆడలేదు.మొదటగా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది.

మూవీని కొద్దిగా ప్రమోట్ చేసిన తర్వాత కొన్ని ఎక్కువ డబ్బులు వచ్చాయి.మొత్తం మీద దాదాపు రూ.6 కోట్లతో ఈ మూవీ జస్ట్ పాస్ అయింది.కథ బాగుండటం వల్ల ఈ సినిమా ఎలాగోలా నష్టాల నుంచి బయటపడింది.వెంకటేష్ కు ఇది రెండవ హిందీ ఫిలిం.

దీని తర్వాత మళ్లీ 28 ఏళ్లకు వెంకటేష్ బాలీవుడ్ స్క్రీన్‌పై మెరిశాడు.సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" గుండమనేని బాలకృష్ణ అలియాస్ "రౌడీ అన్న"గా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు.

రీసెంట్ గా తెలుగు సినిమా "సైంధవ్"లో యాక్ట్ చేసిన వెంకటేష్ ఫ్లాప్ అందుకున్నాడు.బాలకృష్ణ చిరంజీవి ఈ వయసులో హిట్స్ కొడుతున్న వెంకటేష్ మాత్రం సోలోగా ఒక సక్సెస్ సాధించలేకపోతున్నాడు.

అలీ ప్రస్తుతం కమెడియన్ గానే కొనసాగుతున్నాడు.

తాజా వార్తలు