ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలి : కేసీఆర్

ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలని, మంచి చేసే పార్టీ ఏది? ఏ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందన్నది ఆచితూచి ఓటు వేయాలని ముఖ్య మంత్రి కేసీఆర్( KCR ) పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్నగర్( Sirpur Kagaznagar ) లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ,కానీ ఎన్నికలు అవగానే ఆ హామీను విస్మరించిందని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నట్లుగా నేను పోరాడాను కాబట్టే భయపడి కాంగ్రెస్( Congress ) ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత భూములు ధరలు పెరిగాయని, తండాలకు కూడా మంచినీళ్లు వస్తున్నాయని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, ఒక్కొక్క విద్యార్థిపై ల1.

25 లక్షల ఖర్చుపేడుతున్నామని చెప్పుకొచ్చారు .

రైతులకు ఇబ్బందిగా ఉండకూడదని రైతుబంధు( Rythu Bandhu ) ఇస్తున్నాం.పోడు భూముల పంపిణీకి కేంద్ర నియమాలు అడ్డంకిగా మారాయని ఆయన చెప్పుకొచ్చారు.వివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్ ( Dharani Portal )తీసుకువచ్చామని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ధరణి ని భూస్థాపితం చేస్తామంటున్నారని అప్పుడు రైతుబంధు, ధాన్యం కొనుగోలు డబ్బులు ఎలా వస్తాయని? మళ్లీ దళారులు వ్యవస్థ తీసుకురావడానికి కాంగ్రెస్ చూస్తుందంటూ ఆయన దుయ్యబట్టారు .

హెలికాప్టర్ మొరాయించడం తో ఆసిఫాబాద్( Asifabad ) వెళ్లాల్సిన కెసిఆర్ రోడ్డు మార్గంలో ప్రయాణించారు.ఆసిఫాబాద్ సభలో మాట్లాడుతూ ఒకప్పుడు వర్షం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని పత్రికల్లో వచ్చేదని, ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి తో మెడికల్ కాలేజ్ ఇక్కడ నడుస్తుందని, బారాస పుట్టింది తెలంగాణ ప్రజల కోసమని చెప్పుకొచ్చారు.తెలంగాణ తెచ్చుకోబట్టి ఆసిఫాబాద్ జిల్లా అయిందని ఇక్కడ గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వగలిగామని గిరిజనేతరులకు కూడా త్వరలోనే పట్టాలు ఇస్తామంటూ ఆయన చెప్పుకోచ్చారు .

Advertisement
Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు