వివిధ సౌందర్య ఉత్పత్తులపై భారీగా పెరిగిన ధరలు.. మీరు వాడే లిస్టు చూసుకోండి జరా!

ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.సగటు మధ్యతరగతివాడు బతకలేని పరిస్థితి దాపురించింది.

అయితే ఇదే క్రమంలో తాజాగా పలు సౌదర్యం ఉత్పత్తులమీద కూడా ధరలు పెంచేశారు.దేశంలోని అతిపెద్ద సంస్థ ఇంటువంటి FMCG కంపెనీల్లో ఒకటైనటువంటి హిందుస్థాన్‌ యునీలివర్‌ కొన్ని ఉత్పత్తుల ధరలను 15% వరకు పెంచబోతోందని భోగట్టా.

ఈ క్రమంలో అనేక బ్రాండ్ల ధరలు పెరగనున్నాయి.ప్రస్తుత ఆర్ధిక గడ్డుకాలంలో ధరలు పెంచక తప్పడంలేదని సదరు కంపెనీ తెలిపింది.

ఈ నేపథ్యంలో ధరలు పెరగనున్న బ్రాండ్ల వివరాలు చూద్దాం.ఎక్కువమంది వాడే లక్స్‌ సబ్బు రేటు మల్టీ ప్యాక్‌ వేరియెంట్లను బట్టి 9% పెరిగిందట.అలాగే చాలామంది మధ్యతరగతి వారు వాడుతున్న సన్‌సిల్క్‌ షాంపూ ధర, వివిధ రకాలను బట్టి రూ.8 -10 వరకు పెంచుతున్నారు.అలాగే ఎక్కువమంది చలికాలంలో వాడే పియర్స్‌ సోప్ ధర వివిధ వేరియంట్లలో 2.4% నుండి 3.7% పెరగనుంది.అలాగే ఎక్కువమంది విరివిగా వాడే క్లినిక్‌ ప్లస్‌ 100ml షాంపూ ధర ఏకంగా 15% పెరిగి వినియోగదారుడికి గుదిబండగా మారబోతుంది.

Advertisement

ఇక ముఖ్యంగా యువతులు ఎక్కువగా వాడే గ్లో అండ్‌ లవ్లీ అదేనండి, ఒకప్పటి ఫెయిర్ అండ్ లవ్లీ ధర 6-8% వరకు పెంచుతున్నారు.

అలాగే మన అందరి ఆల్ టైం ఫెవరెట్ పాండ్స్‌ టాల్కమ్‌ పౌడర్‌ 5-7% వరకు పెరుగుతుంది.ఏప్రిల్‌లోనే హిందుస్థాన్‌ యునీలివర్‌ చాలా వరకు ధరలు పెంచడం కొసమెరుపు.అయినా వారు తృప్తి చెందక మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో స్కిన్‌ క్లీన్సింగ్‌ నుంచి డిటర్జెంట్ల ఉత్పత్తుల ధరను 3-20% వరకు పెంచారు.గత 30 ఏళ్లలో ఇలాంటి ద్రవ్యోల్బణం తరహా పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని, HUL CEO, అయినటువంటి MD సంజీవ్‌ మెహతా అన్నారు.

సమీప భవిష్యత్తులో పరిస్థితులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని అంచనా వేసి, ఈ తరహా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని అనడం గమనార్హం.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు