హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో భారీ చోరీ..!

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో భారీ చోరీ జరిగింది.ఈ ఘటనతో లక్షలు విలువ చేసే బంగారు నగలు దొంగతనం అయినట్లు తెలుస్తోంది.

10.36 గ్రాముల డైమండ్ బ్రాస్లెట్, 3.61 గ్రాముల డైమండ్ రింగ్ అపహరణకు గురైయ్యాయని బాధితుడు చెబుతున్నట్లు సమాచారం.బాధితుడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త.

పార్క్ హయత్ హోటల్ కి వచ్చిన సమయంలోనే తన బ్యాగులో నుంచి బంగారు నగలు మాయం అయ్యాయని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు .దర్యాప్తు చేస్తున్నారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?