మహా చండీయాగంలో పాల్గొన్న పలువురు దంపతులు

యాదాద్రి భువనగిరి జిల్లా:దేవీ నవరాత్రి ఉత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)రామన్నపేట మండలం భోగారం గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారి( Durga Ammavari ) వద్ద అర్చకులు శివకుమార్ కరకములచే మహా మహా చండీ హోమ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు పశుసంపద,గ్రామ ప్రజలు అమ్మవారి కృపా కటాక్షములతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో గోగు హరిప్రసాద్ యాదవ్ స్వరూప,కాంజోజు శ్రీనివాస్ చారి స్రవంతి, కునూరు వెంకటేష్ గౌడ్ అనూష,చెరుకు నరసింహ గౌడ్ రామేశ్వరి,పాపని కేశవులు లక్ష్మమ్మ,కర్నాటి శ్రీరాములు అండాలు, మేడి కృష్ణ రేవతి,గంజి నాగమల్లేష్ వాణి,జెల్లా శీను సంధ్య దంపతులు, భవాని మాలాధారులు, శివాజీ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable

Latest Yadadri Bhuvanagiri News