తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పటికప్పుడు మెరుగవుతోంది అనుకుంటుండగా నే ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలు ఆ పరిస్థితిని మార్చి వేస్తున్నాయి.
ఈ గ్రూపు రాజకీయాలను పూర్తిగా పోగొట్టి పార్టీ నాయకుల మధ్య సఖ్యత పెంచేందుకు అధిష్టానం పెద్దలు ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటున్న, పరిస్థితిలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు.
ఇక ఇప్పుడు చూస్తే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుంది.అయినా సీనియర్లు, జూనియర్లు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
మొన్నటి వరకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన మాణిక్యం ఠాగూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో, ఆయనను తప్పించి ఆయన స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యరావు థాక్రే ను అధిష్టానం పెద్దలు తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు.ప్రస్తుతం తెలంగాణలో పర్యటించిన ఆయన గ్రూపు రాజకీయాలపై దృష్టి సారించారు.దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి
సీనియర్లు అడ్డం పడుతుండడంతో పాటు, తాము కూడా పాదయాత్ర చేస్తామని అధిష్టానం పై సీనియర్లు ఒత్తిడి పెంచుతున్నారు.దీంతో ఈ సమస్యకు పెట్టె విధంగా మాణిక్ రావు థాక్రే ఓ కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు.రేవంత్ రెడ్డి యాభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకునేందుకు ఆయన అనుమతించారు.
మిగతా సీనియర్లు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకునేందుకు ఆయన అవకాశం కల్పించారు.
దీంతో సీనియర్లు రేవంత్ పాదయాత్ర కు అంగీకారం తెలిపారట.ఈ వ్యవహారంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరిని ఏకతాటిపై తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దల కోరిక ఇప్పుడిప్పుడే నెరవేరుతున్నట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా మాణిక్యరావు థాక్రే ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి.
తాను ఎవరికి వ్యతిరేకం కాదని, అనుకూలం కాదని తన విషయంలో అటువంటి ఆలోచనలను పక్కన పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరికీ ఆయన సూచించారట.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy