Manchu Manoj : ఇంద్ర సినిమాతో నాకు హనుమాన్ తో మా అబ్బాయికి గూస్ బంప్స్.. హనుమాన్ కు మనోజ్ రివ్యూ ఇదే!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరో తేజా సజ్జా( Teja Sajja ), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్లు కూడా ఒకటి.

ఏ ముహూర్తాన సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా( Hanuman movie ) విడుదల అయిందో కానీ ఆ క్షణం నుంచి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా కూడా మారు మోగిపోతున్నాయి.

దానికి తోడు చిన్న సినిమాకు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించడంతో సెలబ్రిటీలు కూడా ఈ సినిమా గురించి ఈ సినిమాలో నటీనటుల గురించి మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు హనుమాన్ మూవీ సక్సెస్ అయినందుకు గాను కంగ్రాట్స్ చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా హీరో మంచు మనోజ్( Manchu Manoj ) కూడా ఈ సినిమా గురించి స్పందించారు.అయితే సినిమా చూసిన వారు ప్రశంసలు కురిపిస్తుంటే.చూడని వారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాని, హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మను( Prashanth Varma ) పొగడ్తలతో ముంచెత్తాడు.ఇంద్ర సినిమాతో నాకు, హనుమాన్ సినిమాతో మా అబ్బాయ్ ధైర్యవ్‌కి గూజ్‌బంప్స్ తెప్పించావ్ కదా తమ్ముడు తేజా సజ్జా.

Advertisement

కిల్లర్ పెర్ఫార్మెన్స్.ఇరగ్గొట్టేశావ్.28 సంవత్సరాలకే రెండు జనరేషన్స్‌ని కవర్ చేశావ్.ఒకే ఒక్కడు ప్రశాంత్ వర్మ నుండి వచ్చిన అద్భుతమైన చిత్రమిది.

బ్రదర్ ప్రశాంత్ వర్మ.నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది.

అంటూ మంచు మనోజ్ తేజా సజ్జా ని పొగడ్తలతో ముంచెత్తారు హీరో మంచు మనోజ్.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్, స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక వాటిపై స్పందించిన నెటిజన్స్ ఎస్ హనుమాన్ సినిమా సూపర్, ఎక్సలెంట్ తెలుగు వారు గర్వించదగ్గ సినిమా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మనోజ్ కంటే ముందు చాలా మంది బాలయ్య లాంటి సెలబ్రిటీలు ఈ సినిమా చూసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు