దురదగా ఉంది గోకుతారా.... గొడవ గురించి వెటకారంగా సమాధానం చెప్పిన మనోజ్!

ఈ మధ్యకాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారి మంచు కుటుంబం (Manchu Family)తరచూ వార్తలో నిలుస్తున్నారు.

మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఎప్పుడైతే విష్ణు(Vishnu) మనోజ్(Manoj) సహచరులు అతనిపై దాడికి వెళ్లారో ఆ క్షణం వీరి మధ్య ఉన్న గొడవలు నిజమేనని మనోజ్ షేర్ చేసిన వీడియో ద్వారా తెలిసిపోయింది.అయితే ఇది చిన్న గొడవేనని అప్పటికి ఈ వీడియో పై స్పందించిన తిరిగి విష్ణు మాత్రం ఇది ఓ రియాలిటీ షోలో భాగంగా చేసినదని ఈ గొడవను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

అయితే ఈ రియాలిటీ షో గురించి ఇటు మనోజ్ కానీ లేదా మంచు లక్ష్మి కానీ ఏ విధంగాను స్పందించలేదు దీంతో ఈ గొడవ గురించి ఇప్పటికి పలు సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.తాజాగా ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోహన్ బాబు(Mohan Babu)కు అలాగే మంచు మనోజ్ కు ఈ గొడవ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో వీరిద్దరూ చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఈ వ్యవహారపై క్లారిటీ ఇవ్వమని మీడియా మనోజ్(Manoj) ను ప్రశ్నించగా మనోజ్ వెకిలి నవ్వులు నవ్వుతూ దురదగా ఉంది గోకుతారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు వెటకారంగా సమాధానం చెప్పారు.ఇక మోహన్ బాబు సైతం మీ ఇంట్లో మీకు నీ భార్యతో ఉన్న సంబంధం ఏంటో చెప్పగలవా? అని ప్రశ్నించారు.తప్పయ్యా మీరంతా చదువుకున్న విజ్ఞానులు.

Advertisement

ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి.మీరు అడిగే ప్రశ్నలకు కూడా సమయం సందర్భం చూసుకోవాలి కదా.నేను ప్రస్తుతం హాస్పిటల్ ఓపెనింగ్ కు వచ్చాను ఇది అద్భుతంగా జరగాలి అంటూ మోహన్ బాబు ఈ ప్రశ్నను దాటివేశారు.ఇలా గొడవ గురించి మోహన్ బాబు మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు