వాళ్ళు వెళ్తే నాకేంటి సంబంధం.. రేవ్ పార్టీ పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

మంచు లక్ష్మి( Manchu Lakshmi ) , అజయ్‌( Ajay ) , వేదిక, ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ యక్షిణి ( Yakshini ).

ఈ వెబ్ సిరీస్ జూన్ 14వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ లాంఛ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మీ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ( Benguluru rave party ) సంచలనం రేపుతున్న సంగతి మనకు తెలిసిందే .అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మికి ఈ రేవ్ పార్టీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Manchu Lakshmi React On Benguluru Rave Party , Manchu Lakshmi, Rave Party, Ben

ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరులు తనని రేవ్ పార్టీ గురించి ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నలకు ఈమె సమాధానం చెబుతూ ప్రస్తుతం రేవ్ పార్టీ గురించి మాట్లాడటానికి ఇది సరైన సందర్భం కాదని తెలిపారు.అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని నేను మాత్రం ఇలా సిరీస్ గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు.

Advertisement
Manchu Lakshmi React On Benguluru Rave Party , Manchu Lakshmi, Rave Party, Ben

నేను నటించిన సిరీస్ గురించి మాట్లాడదాం.ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం.

ఆ వ్యక్తులు.వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Manchu Lakshmi React On Benguluru Rave Party , Manchu Lakshmi, Rave Party, Ben

బెంగళూరు( Benguluru )లోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి నటి హేమ( Actress Hema ) కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.ఈమెతో పాటు మరి కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు