నేను ఉద్యోగం కోల్పోవడానికి అసలు కారణమిదే.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు ప్రేక్షకులకు నటి మంచు లక్ష్మీ ( Actress Manchu Lakshmi )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో పలు సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి.

అలాగే ఈమె హాలీవుడ్ మూవీలలో నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వరులుగా మారాయి.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ( Justice Hema Committee ) నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఈ కమిటీని ఉద్దేశించి నటి మంచు లక్ష్మి తాజాగా మాట్లాడారు.ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి నాకు పూర్తిగా తెలియదు.

సమాజంలో మహిళలకు సమానత్వం( Equality for women ) ఉండాలి.అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని తెలిపారు మంచు లక్ష్మి.

అనంతరం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను( Sexual harassment ) ఉద్దేశించి మాట్లాడుతూ.నువ్వు ఎవరితోనూ చెప్పలేవని, అంత ధైర్యం నీకు లేదని భావించిన కొంతమంది వ్యక్తులు నిన్ను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారు.

అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

కెరీర్‌ మొదలుపెట్టిన సమయంలో నన్ను కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారు.వారితో నేను చాలా దురుసుగా ప్రవర్తించేదాన్ని.ఆ విధంగానే నేను ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను.

Advertisement

నా ఉద్యోగం పోవడానికి కారణం కూడా వాళ్లే అని తెలిపింది మంచు లక్ష్మి.ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆమె కామెంట్ల పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.అనంతరం కోల్కతాలో జూనియర్ వైద్యురాలి పై జరిగిన అత్యాచారం గురించి మాట్లాడుతూ.

ఆ ఘటన నన్ను షాక్ కీ గురి చేసింది.ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని ఆమె తెలిపింది.

తాజా వార్తలు