ఇండిగో సంస్థ నుంచి మంచు లక్ష్మికి చేదు అనుభవం... గేటు బయట కూర్చో పెట్టిన సిబ్బంది!

నటి మంచు లక్ష్మికి తాజాగా ఇండిగో విమానయాన సంస్థ నుంచి చేదు అనుభవం ఎదురయింది.

దీంతో మండిపడినటువంటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా సదరు విమానయాన సంస్థను ట్యాగ్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈమె సోమవారం తిరుపతిలో మంచు మనోజ్ దంపతులతో కలిసి సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.స్వామివారి దర్శనం అనంతరం ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరారు.

అయితే విమానంలో తన బ్యాగ్ మర్చిపోవడంతో ఈ విషయం గురించి సిబ్బందికి తెలియచేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.మంచిగా ఉంటే పని అవ్వదు.విమానంలో నా పర్స్ మరిచిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను.

Advertisement

మీ సిబ్బందిలో ఎవరైనా సహాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు.తాను తిరుపతి నుంచి హైదరాబాద్ కి వచ్చిన సమయం కన్నా గేటు బయట ఎక్కువ సేపు వెయిట్ చేశానంటూ అసహనం వ్యక్తం చేశారు.103 డిగ్రీల జ్వరం ఉన్నా కూడా తనని అంతసేపు వెయిట్ చేయించారని మండిపడ్డారు.సాయం చేసేందుకు ఒక్కరూ కూడా లేరు.

గ్రౌండ్ స్టాఫ్ కూడా లేరు.మీరు జీరో సేవలందిస్తూ, ఎలా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

ఈ విధంగా ఈమె వరుస ట్వీట్స్ చేస్తూ ఉండడంతో సదరు విమానయాన సమస్త స్పందించారు.హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మా మేనేజర్‌తో మాట్లాడినందుకు ధన్యవాదాలు.విమానంలో మీరు మరిచిపోయిన మీ బ్యాగ్ తిరిగి మీరు పొందడంలో మా సిబ్బంది సహాయం చేశారని భావిస్తున్నాము.

ఇకపై ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటాము అలాగే మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.తిరిగి మీరు మా విమానంలో ప్రయాణం చేయాలి.ఇకపై ఎలాంటి సమస్య ఉన్న మీరు నేరుగా మాకు మెసేజ్ చేయవచ్చు అంటూ మంచు లక్ష్మి ట్వీట్లకు ఇండిగో సమస్థ రిప్లై ఇచ్చారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు