విష్ణు మనోజ్ గొడవపై స్పందించిన మంచు లక్ష్మి, తల్లి నిర్మల.. ఏమన్నారంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదైనా ఉంది అంటే అది మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవ అని చెప్పాలి.

మంచు ఫ్యామిలీ(Manchu Family)లోగత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా నిజంగానే మనోజ్(Manoj) విష్ణు(Vishnu) మధ్య గొడవలు జరుగుతున్నాయని వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడటంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే మనోజ్ అనుచరుడిపై విష్ణు దాడి చేయడం అలాగే మనోజ్ పై కూడా దాడికి ప్రయత్నించారు.

ఇలా విష్ణు తనపై దాడికి వస్తున్న సమయంలో మనోజ్ తీసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

Manchu Lakshmi And Nirmalas Mother Reacted To Vishnu Manojs Quarrel What Do They

ఇకపోతే ఈ వీడియో పట్ల మోహన్ బాబు(Mohan Babu) సీరియస్ కావడంతో మనోజ్ వీడియోని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ వీడియో డిలీట్ చేసే లోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.అయితే తాజాగా ఈ గొడవ గురించి మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi) అలాగే తన భార్య నిర్మల స్పందించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Manchu Lakshmi And Nirmalas Mother Reacted To Vishnu Manojs Quarrel What Do They

ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఈ గొడవపై స్పందిస్తూ తాను తన ఇంట్లో లంచ్ ఏర్పాటు చేస్తున్నానని ఆ పనిలో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.

Manchu Lakshmi And Nirmalas Mother Reacted To Vishnu Manojs Quarrel What Do They

తనకు ఈ గొడవ గురించి ఏమాత్రం తెలియదని తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు అంటూ ఈమె ఈ విషయంపై స్పందించారు.ఇక మోహన్ బాబు భార్య నిర్మల కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ తన కొడుకుల మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ ఈమె తెలియజేశారు.ఇలా మోహన్ బాబు కుమార్తె, భార్య విష్ణు, మనోజ్ గొడవల గురించి స్పందించిన తీరు చూస్తుంటే ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది.

ఇక విష్ణు కూడా ఇలాంటివి మా మధ్య తరచూ జరుగుతూ ఉంటాయి అని చెప్పడం గమనార్హం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు