Manchu Lakshmi : ఛీ ఛీ.. ఇక మీడియా మారదు.. మంచు లక్ష్మి నువ్వు నిజంగా గ్రేట్

రామ్ చరణ్ ఉపాసన ( Ram Charan ,Upasana )దంపతులకు బిడ్డ పుడితే అపోలో ఆసుపత్రి ముందు డజన్ల కొద్ది కెమెరాలు వారి రాక కోసం ఎదురు చూడటం మనం చూసాం.

కరోన కష్టకాలంలో ప్రపంచమంతా విలవిలలాడుతుంటే ఇంట్లో కూర్చుని వందల కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకునే స్టార్ హీరోలు ఆమ్లెట్లు పెసరట్లు వేసుకోవడం కూడా చూసాం.

అభిమానం అనే భక్తితో భజన చేయించుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంటూ ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం సేవ చేయని హీరోలను చూసాం.కాకిని కూడా ఎంగిలి చేత్తో తరమి వేయని మన టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో ఏదైనా ఒక వ్యక్తి మంచి పని చేస్తే కవరేజ్ దొరక్కపోగా మామూలు గుర్తింపు సైతం దొరకకపోవడం నిజంగా బాధాకరం.

Manchu Lakshmi Adopted Schools

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనే కదా మీ అనుమానం.అయితే అసలు విషయంలోకి వెళ్దాం.మంచు లక్ష్మి( Manchu Lakshmi ) మంచువారింటి ఏకైక ఆడపడుచు.

వందల కోట్ల ఆస్తులు విలువ చేసే మోహన్ బాబుకి గారాల కూతురు.అయినా కూడా ఆమె మంచి వారింటికి వారసురాలు కాదు.

Advertisement
Manchu Lakshmi Adopted Schools-Manchu Lakshmi : ఛీ ఛీ.. ఇక మీ�

కేవలం కూతురు మాత్రమే.తన తమ్ముళ్లకు ఆస్తిగా కట్నం కింద వందల కోట్లు ఆస్తి వచ్చిన అవేమీ మంచు లక్ష్మికి చెందినవి కాదు.

ఇక తానేమి పెద్ద నటి కూడా కాదు డబ్బు పరంగా కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదు.కానీ ఎందుకో మంచి మనసున్న లక్ష్మి అని అనిపించుకుంది.

Manchu Lakshmi Adopted Schools

కానీ మంచి పనులు చేయాలని నిర్ణయించుకుంది.అందుకే ఇప్పటికే యాదాద్రి జిల్లాలోని( Yadadri ) 56 పాఠశాలలను దత్తత తీసుకుంది.ఇప్పుడు మరో 36 పాఠశాలలను కూడా దత్తత తీసుకోబోతుంది.

ఇంత పెద్ద పని ఆమె చేసిన ఆ దానికి దక్కిన కవరేజీ మాత్రం శూన్యం.ఏదైనా స్టార్స్ చారిటీ పని చేస్తున్నారు అంటే మహేష్ బాబు అలాగే లారెన్స్ చేసే గుండా ఆపరేషన్లు తప్ప మరెవరికి కూడా ఆసరైన మీడియా పబ్లిసిటీ దొరకడం లేదు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అందులో మంచు లక్ష్మి వంటి నటికి దొరికే అవకాశం లేదు.ఎందుకంటే రామ్ చరణ్ కి బిడ్డ పుడితే అదొక వైరల్ న్యూస్ రాకేష్ మాస్టర్ ఎవరి వల్ల చనిపోయాడో తెలుసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్ న్యూస్.

Advertisement

అదే కదా మనకు కావాల్సింది.

తాజా వార్తలు