లాఠీ తీసుకొని పోలీసునే ఉతకబాదిన వ్యక్తి.. వీడియో వైరల్..!

పోలీసులు సామాన్యులను కొట్టడం చూశారు కానీ మీరు ఎప్పుడైనా సామాన్యులు పోలీసులను కొట్టడం చూసారా.బహుశా సినిమాల్లో చూసే ఉంటారు.

నిజ జీవితంలో ఇలాంటివి జరగడం చాలా అరుదు.అయితే తాజాగా ఇలాంటి అరుదైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఒక వ్యక్తి ఒక కానిస్టేబుల్ ని ఉరికిచ్చి మరీ ఉతకబాదుడు బాదాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసి వామ్మో అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.వివరాల్లోకి వెళితే.

Advertisement

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో జై ప్రకాష్ జైస్వాల్‌ అనే కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు.అయితే ఇటీవల అతను ఒక బైక్ పై వెళ్తున్నాడు.

ఈ క్రమంలోనే అతన్ని దినేష్‌ ప్రజాపతి అనే ఒక వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు.దీంతో కానిస్టేబుల్ దినేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.దీంతో ఒక్కసారిగా దినేష్ కానిస్టేబుల్ ప్రకాష్ పై దాడి చేయడం మొదలు పెట్టాడు.

ప్రకాష్ చేతిలోని లాఠీ లాక్కొని విచక్షణ రహితంగా కొట్టాడు.రోడ్లపై ఉరికిస్తూ మరీ చిత్తక్కొట్టుడు కొట్టాడు.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!

అయితే పట్టపగలు ఒక పోలీసునే దంచి కొట్టుడు కొడుతుండగా, స్థానికులు సినిమా చూసినట్లు చూశారు కానీ ఎవరూ ఆపడానికి ముందుకు రాలేదు.ఈ దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

Advertisement

ఈ వీడియోలు స్థానికంగా మాత్రమే కాదు భారత దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం నిందితుడిని తమ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నామని అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా తెలిపారు.ఈ వీడియోను కూడా మీరు చూసేయండి.