వీడొక్కడే సినిమాను సేమ్ టూ సేమ్.. కడుపులో హెరాయిన్ క్యాప్సుల్స్..!

ఒక సినిమా స్మగర్లను ఎంతగా ప్రభావితం చేసిందో అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాలను తీస్తూ ఉంటారు.

కానీ కొందరు సినిమాలలోని కొన్ని సీన్స్ ను నిజజీవితంలో కూడా పాటించేస్తేస్తున్నారు.మీ అందరికి తమిళ నటుడు సూర్య నటించిన వీడొక్కడే సినిమా గుర్తు ఉండే ఉంటుంది.

ఆ సినిమా అంతా మాధక ద్రవ్యలను ఎలా వేరే దేశాలకు తరలిస్తారో అనే కాన్సెప్ట్ తో ఉంటుంది.అయితే ఆ సినిమాలోని ఒక సీన్ మాత్రం ఎవరు ఉహించి ఉండరు.

ఎందుకంటే కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలను తమ ప్రాణాలను సైతం పళంగా పెట్టి కడుపులో దాచుకుని విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తారు.సరిగ్గా అలంటి సీన్ ను ఒక వ్యక్తి నిజ జీవితంలో ఆచరించి చూపించాడు.ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.79 హెరాయిన్​ క్యాప్సుళ్లను మింగి, కడుపులో దాచి స్మగ్లింగ్​కు ప్రయత్నం చేసిన ఒక విదేశీయుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.వివరాల్లోకి వెళితే కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు ఈ విదేశీయుడు పట్టుబడ్డాడు.సుమారు కేజీ బరువున్న ఈ మాదకద్రవ్యాలు రూ.7 కోట్లు విలువ చేస్తాయని కస్టమ్ అధికారులు అంటున్నారు.అయితే ఈ వ్యక్తి ఉగాండ పౌరుడు అని అధికారులు తెలిపారు.

Advertisement
Man Smuggling Heroine Capsules In Stomach Caught In Bangalore Airport Details,

ఉగాండ నుంచి షార్జా మీదుగా బెంగళూరు చేరుకున్నట్లుగా తెలుస్తుంది.

Man Smuggling Heroine Capsules In Stomach Caught In Bangalore Airport Details,

అతడిని బెంగుళూరు విమానాశ్రయంలో అడ్డుకొని తనిఖీ చేయగా అతడి కడుపులో హెరాయిన్ టాబ్లెట్స్ ఉన్నట్టుగా కనుగొన్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి అతడి నుంచి ఈ క్యాప్సుళ్లను బయటకు తీశారు.సినిమాలో మాదిరి ఇలా కడుపులో డ్రగ్స్​ దాచుకుని స్మగ్లింగ్​ చేయడం అనేది బెంగళూరులో తొలిసారిగా చూస్తున్నామని అధికారులు అంటున్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అధికారులు.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement
" autoplay>

తాజా వార్తలు