వీడియో వైరల్: సింహాల దగ్గరికి బైకుపై ఎంట్రీ ఇచ్చిన ఘనుడు.. చివరకు..

ప్రతిరోజు అనేక వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూనే ఉంటాయి.అయితే వాటిలో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి.

అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు వైరల్ గా మారడంలో ముందు వరుసలో ఉంటాయి.ఆ తర్వాత జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు కూడా ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా మరో జంతువులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వైరల్ గా మారిన వీడియో లో సింహాల దగ్గరికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్( Royal Enfield Bike ) తీసుకొని రై.రై.అంటూ ఓ వ్యక్తి వాటి మధ్య నుంచి వెళ్ళిపోయాడు.అయితే ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది చివరికి అతనికి ఏమైంది అన్న వివరాలు చూస్తే.

Man Riding Bike Between Lions Video Viral Details, Viral Video, Social Media, Li

ఆఫ్రికాలోని ( Africa ) ఓ జాతీయ ఉద్యానవనంలో కొందరు జంగిల్ సవారికి వెళ్లిన సమయంలో కొన్ని సింహాలు( Lions ) రోడ్డుకు అడ్డంగా వాహనాల పక్కన పడుకోవడంతో వారందరూ అక్కడ వాహనాలు ఆపేసి వాటిని గమనిస్తూ ఉండిపోయారు.అలా చాలాసేపు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై సింహాల మధ్య నుండి వేగంగా దూసుకు వెళ్ళాడు.అయితే ఆ సమయంలో సింహాలు అతిరిని కేవలం చూసాయి తప్పించి అతనిని ఏమీ అనకపోవడం కోసమేరపు.

Advertisement
Man Riding Bike Between Lions Video Viral Details, Viral Video, Social Media, Li

అయితే ఈ సందర్భాన్ని జూ చూడడానికి వచ్చిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Man Riding Bike Between Lions Video Viral Details, Viral Video, Social Media, Li

ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నేటిజన్స్.రకరకాలుగా ఆ వ్యక్తిపై కామెంట్ చేస్తున్నారు.నీకు ఈ రోజు అదృష్టం బాగుంది గురు.

లేకపోతే వాటికి ఆహారం అయిపోతుంటివి అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా., సింహాలు అప్పుడే ఏదో ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉన్నాయి అందుకే బతికిపోయావ్ లేకపోతే నీకు అదే చివరి రోజు అయ్యిందు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.

ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?
Advertisement

తాజా వార్తలు