రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. చావుకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు!

ఎంతో ఘోర ప్రమాదం జరిగినా, కొందరికి ఏమీ కాదు.త్రుటిలో ప్రాణాలను దక్కించుకుంటారు.

అలాంటి వారికి నిండు నూరేళ్లని పెద్దలు అంటుంటారు.కొందరైతే ఏదో ఉపద్రవం తప్పిందని, గండం ఉందని అనుకుంటుంటారు.

ఇంట్లో సనాతన ధర్మం పాటించే వారు అయితే ఒకటే పూజలు చేస్తారు.తమ వారిని ప్రాణాపాయం నుంచి తప్పించాలని దేవుడికి ఉపవాసాలు ఉండి మరీ పూజలు చేస్తుంటారు.

ఇలాంటివి భారతదేశంలో ఎక్కువ కనిపిస్తాయి.తమ భర్త లేదా బిడ్డలు బయటకి వెళ్లినప్పుడు క్షేమంగా తిరిగి రావాలని ఇంట్లో మహిళలు పూజలు చేస్తుంటారు.

Advertisement

ఇటీవల వచ్చిన అంటే సుందరానికి సినిమాలో ఇంట్లో చేసే హోమాలకు హీరో చాలా ఇబ్బందులు పడతాడు.అయితే ఎవరేం అనుకున్నా అలాంటి పూజలే తమ వారిని ఉపద్రవాల నుంచి కాపాడతాయని బలంగా నమ్ముతారు.

ఇవి ఎలా ఉన్నా జపాన్‌లో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు.రెప్పపాటులో అతడి ప్రాణాలు దక్కాయి.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.జపాన్‌లో ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుంటాడు.

ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో అందరితో పాటే తన కారును నిలిపి వేస్తాడు.గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అన్నట్లు ఎదురు చూస్తుండగా ఊహించని ప్రమాదం జరుగుతుంది.

అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

అకస్మాత్తుగా ఓ పెద్ద స్తంభం అతడి కారుపై పడుతుంది.కారు ముందు భాగం అంతా ధ్వంసం అవుతుంది.

Advertisement

నుజ్జు నుజ్జు అయిన కారులో నుంచి అద్దాలు పగలగొట్టుకుని ఆ వ్యక్తి బయట పడతాడు.ఈ దృశ్యం అంతా సీసీ టీవీ కెమెరాలలో నిక్షిప్తం అవుతుంది.

దానిని ఆడ్లీ టెరిఫైయింగ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

అతడికి అదృష్టం బాగా ఉందని, భూమి మీద నూకలు ఉండడంతోనే బ్రతికి బట్టగట్టగలిగాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు