వైరల్: గజదొంగలు సైతం ఆ తాళాన్ని తీయలేరు... తాళం ఎలా వేశారో చూడండి!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో సోషల్ మీడియా సహజంగానే ప్రాచుర్యం పొందింది.

దాంతో అనునిత్యం ఇక్కడ అనేక రకాల వీడియోలు వైరల్( Viral Video ) అవుతూ ఉంటాయి.

అందులో కొన్ని వీడియోలు జనాలకు ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే.

మీకు కూడా చాలా ఆశ్చర్యం కలగకమానదు.సాధారణంగా దొంగలు( Thieves ) అనబడేవారు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఎవరికీ పట్టు పడకుండా తమకు తోచిన జాగ్రత్తలు తీసుకుంటారు.

ఎందుకంటే ఎవరికున్న నైపుణ్యం వారికుంటుంది మరి! అందుకే జనాలు తాము బయటకి వెళ్ళేటప్పుడు తమ ఇళ్లకు ఇలాంటి దొంగల బారిన పడకుండా ఉండడానికి ధృడమైన తాళాలు వేసేస్తూ ఉంటారు.

Advertisement

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోలో కూడా అదే జరిగింది.ఇందులో ఓ వ్యక్తి చాలా వెరైటీగా తాళం( Lock ) వేశాడు.ఇంకేముంది? ఆ వీడియో చూసిన వారందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు.@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ కాగా ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను తెగ అలరిస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోని ఒకసారి గమనిస్తే.ఓ ఇంటి తలుపు వేసి ఉంది.దానికి గడియ కూడా పెట్టి ఉంది.

అయితే ఆ గడియకు తాళం లేకపోవడం గమనార్హం.ఆ పక్కనే తాళం కప్ప వేసి ఉండడం గమనార్హం.

ఈ తరుణంలో ఓ వ్యక్తి వెళ్లి గడియ తీయడానికి ప్రయత్నిస్తే సగమే వచ్చింది.పూర్తిగా రాలేదు మరి.

రష్మిక అబార్షన్ చేయించుకుందా....బాంబ్ పేల్చిన నటుడు...ఆయనే కారణమా?
హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనా..ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలివే!

అవును మరి, గడియ పూర్తిగా బయటకు రావడానికి తాళం కప్ప అడ్డుపడుతోంది.కాగా ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ఆ వీడియో చూసిన వారు అంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ఈ క్రమంలో వారు తాళం అలా ఎందుకు వేశారో అర్థం చేసుకోలేకపోతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హాట్ టాపిక్ అవుతోంది.కాగా ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.7 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించగా.5 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేయడం కొసమెరుపు.మరికొంతమంది ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

"ఎంతటి గజ దొంగ అయినా ఆ ఇంట్లో చోరీ చేయలేరు!" అని కొంతమంది కామెంట్స్ చేస్తే, "ఇలా కూడా తాళం వేయవచ్చా!" అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.మరికొందరు "ఇతను దొంగలకే దొంగలా ఉన్నాడు!" అంటూ కామెంట్లు చేశారు.

తాజా వార్తలు