అత‌ను రోజూ 10 కూల్‌డ్రింక్స్ తాగాడు. చివ‌ర‌కు ఏమైందో తెలుసా..?

బ‌య‌ట రెస్టారెంట్లు, హోట‌ల్స్‌లో డిన్న‌ర్ చేసేట‌ప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు.ఇక కొంద‌రైతే రెగ్యుల‌ర్‌గా వాటిని మంచి నీళ్లు తాగిన‌ట్టు తాగుతారు.

ఎందుకంటే అవి జ‌నాల‌ను ఆక‌ర్షిస్తాయి.జంక్ ఫుడ్ క‌నుక ఎవరైనా వాటికి ఇట్టే దాసోహం అంటారు.

అయితే అలా కూల్ డ్రింక్స్‌ను తాగితే వాటి వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోరు.కానీ అత‌ను అలా కాదు.

కూల్ డ్రింక్స్ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే న‌ష్టాల‌ను ప్రాక్టిక‌ల్‌గా వివ‌రించారు.ఇంత‌కీ అత‌ను ఎవ‌రు, ఏం చేశాడో తెలుసా.?

Advertisement

అత‌ని పేరు జార్జ్ ప్రియ‌ర్‌.అమెరికా వాసి.ఇత‌ను కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను గురించి మ‌న‌కు తెల‌పాల‌నుకున్నాడు.

ఇంకేముందీ.వెంట‌నే ఆ ప‌ని ప్రారంభించేశాడు.

అందులో భాగంగా ప్రియ‌ర్ రోజూ 10 కోక్‌ల‌ను తాగ‌డం మొద‌లు పెట్టాడు.అయితే కొన్ని రోజుల త‌రువాత అత‌ను బ‌రువు పెరిగాడు.

ఈ క్ర‌మంలో కోక్‌ను రోజూ తాగుతూ తాను ఎంత బ‌రువు పెరుగుతుంది వెయింగ్ మెషిన్‌పై లెక్కించాడు.ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను నెట్‌లో పోస్ట్ చేశాడు.

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణమే!

దీంతో ఆ వీడియో వైర‌ల్ అయింది.అయితే ప్రియ‌ర్ అలా కోక్‌లు తాగ‌డం ప్రారంభించ‌క ముందు 76 కిలోలు మాత్ర‌మే ఉన్నాడు.

Advertisement

కానీ రోజూ 10 కోక్‌ల‌ను తాగ‌డం ప్రారంభించాక అత‌ను బ‌రువు అమాంతం పెరుగుతూ వ‌చ్చాడు.ఈ క్ర‌మంలో చివ‌ర‌కు అత‌ను ఏకంగా 10 కిలోల బ‌రువు పెరిగి 86 కిలోల‌కు చేరుకున్నాడు.

దీంతో అత‌ను ఇప్పుడు చెబుతుంది ఒక్క‌టే.కోక్ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి న‌ష్టం ఉంటుందోన‌ని అత‌ను ప్రాక్టిక‌ల్‌గా చెప్పాడు.

అంతేకాదు, మ‌నం నిత్యం సేవించే ప‌లు డ్రింక్స్‌లో ఎంత చ‌క్కెర ఉంటుందో కూడా చెప్పాడు.క‌నుక.

ఎవ‌రైనా కూల్‌డ్రింక్స్‌ను అదే ప‌నిగా తాగుతుంటే ఈ ఎక్స్‌ప‌రిమెంట్‌ను కచ్చితంగా ఓసారి జ్ఞాపకం తెచ్చుకోండి.లేదంటే బ‌రువు పెరుగుతారు.

దాని వ‌ల్ల మళ్లీ ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో అంద‌రికీ తెలిసిందే.కాబ‌ట్టి కూల్ డ్రింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించండి.!.