Claps Guinness World Record: చప్పట్లు కొట్టి గిన్నిస్ రికార్డులకెక్కిన యువకుడు.. ఒక్క నిమిషం ఎన్నికొట్టాడో తెలుసా?

గిన్నిస్ రికార్డులు కధలు వింటే ఒక్కోసారి చాలా విడ్డురంగా అనిపిస్తుంటుంది.ఆమాత్రం దానికే అవార్డులు ఇచ్చేస్తారా అనిపించక మానదు.

కానీ నిజం, కాదేది కవితకు అనర్హం అన్నట్టు.మీలో ఎలాంటి ప్రత్యేకత వున్నా దానినే గిన్నిస్ వేదికగా చాటుకొని రికార్డులు బద్దలు కొట్టేయచ్చు.

తాజాగా ఓ యువకుడు చప్పట్లు కొట్టి గిన్నిస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.చప్పట్లు కొట్టడం చాలా తేలికని తక్కువ అంచనా వేయద్దు.

సమయం, లెక్క అనేది చాలా ముఖ్యం.అవును, కాల వ్యవధిలోనే తనదైన మార్క్‌ వేశాడు సదరు రికార్డర్.

Advertisement

కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఏకంగా 1140 సార్లు చప్పట్లు చరిచి అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.అంటే మనం ఒక్క సెకనుకి లెక్కేసుకుంటే.19సార్లు చప్పట్లు కొట్టి రికార్డ్ సృష్టించాడు.అదే అతని ప్రత్యేకత అని తెలుసుకున్న అతగాడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ట్రై చేసి విజయం సాధించాడు.

కాగా ఈ క్రమంలో అమెరికాకు చెందిన డాల్టన్ మేయర్ కొట్టిన చప్పట్లు రికార్డుని ఇతగాడు బ్రేక్ చేసాడు.ఇలా నిమిషం వ్యవధిలోనే 1000 మార్క్ దాటి.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

అతని ట్యాలెంట్‌కు ఫిదా అయిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు, అతనిలో వున్న ప్రత్యేకతని గుర్తించారు.ఈ ఏడాది మార్చి నెలలోనే ఆ ఘనకార్యం అతగాడు సాధించాడు.కాగా తాజాగా దాన్ని వారు అధికారికంగా గుర్తించి, ప్రకటించారు.

డాల్టన్ మేయర్.మణికట్టును ఉపయోగించి చప్పట్లు కొట్టాడు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

డాల్టన్ కంటే ముందు ఎలి బిషప్ అనే వ్యక్తి పేరిట ఈ రికార్డ్ (1 నిమిషంలో 1103 సార్లు క్లాప్స్) నమోదు కాగా తాజాగా దాన్ని మనోడు బ్రేక్ చేసి టాప్ లోకి దూసుకుపోయాడు.ఇకపోతే ఈ బ్రేక్ ని సాధించడం ఇంక ఎవరి వలన కాదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు