ఉద్యోగం పోయిందని అతడు చేసిన పనికి పిచ్చి పట్టిందని పిచ్చి హాస్పిటల్‌లో వేశారు, ఏం చేశాడో తెలుసా?

ఒక సామాన్య వ్యక్తికి ఉద్యోగం జీవనాధారం.ఆ ఉద్యోగం పోయిన సందర్బంలో అతడి స్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తనను నమ్ముకుని ఉన్న కుటుంబంను నడిపించాలి.కుటుంబ భారం మోయాలంటే కొత్త ఉద్యోగం చేసుకోవాలి.

కొత్త ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా కూడా సఫలం కాకుంటే అప్పుడు పరిస్థితి ఏంటీ.ఆ వ్యక్తి పిచ్చి వాడు అవ్వడం ఖాయం.

తన వారి గురించి ఆలోచించి వారికి ఏం చేయలేక పోతున్నాను అనే బాధతో చాలా మంది మానసికంగా క్రుంగి పోవడంతో పాటు ఏదో ఒక పాడు పనికి సిద్దం అవుతారు.

Advertisement

తాజాగా చతీస్‌గడ్‌కు చెందిన ఒక వ్యక్తి తాను చాలా కాలంగా చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఏం చేయాలో పాలుపోక నెల రోజులుగా ఇబ్బందికి గురవుతున్నాడు.తన సమస్యకు పరిష్కారం చూపమంటూ ఒక జ్యోతిష్యుడిని అడిగితే అతడు కొన్ని క్షుత్రపూజలు చేసి నీకు నీవుగా మట్టిలో పాతి పెట్టుకో అంటూ చెప్పాడట.జోతిష్యుడి మాటలను నమ్మిన ఆ వ్యక్తి పూజలు అయిన తర్వాత మూడు అడుగుల లోతు గుంట తవ్వి అందులో తాను పడుకుని పూడ్చుకోవడం ప్రారంభించాడు.

బాడీ మొత్తం పూడ్చుకున్న తర్వాత తలకు ఒక కవర్‌ పెట్టుకుని తలను కూడా పూడ్చుకున్నాడు.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.మరో అయిదు నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే చనిపోయేవాడు.

ప్రాణాలు తీసుకునేందుకు సిద్దం అయిన ఆ వ్యక్తికి మానసిక పరిస్థితి బాగాలేదని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్‌ చేయడం జరిగింది.ప్రస్తుతం అతడి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం ఎందుకు? కళ్లు తెరిచి తుమ్మితే అలా జరుగుతుందా??

ఉద్యోగం దొరకకుంటే ఏదో ఒక పని చేసుకుని బతికేయవచ్చు.మరీ ఇలా చేయడంతో ఇప్పుడు అతడు మరింత ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది.

Advertisement