Priyamani: నేను ప్రియమణికి ఎలాంటి సపోర్ట్ చేయలేదు : మాల్గాడి శుభ

ముప్పై ఏళ్ళ క్రితం సినీ రంగానికి గాయనిగా ఎంట్రీ ఇచ్చింది శుభ.ఈ 30 ఏళ్లలో ఆమె ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు.

అంతే కాదు ఆమె తెలుగు వారికి కూడా బాగా పరిచయమే.అయితే తమిళనాడు రాష్ట్రంలో పుట్టి ముంబైలో పెరిగారు శుభ.ఆమె ముంబైలోనే కర్ణాటక( Karnataka in Mumbai ) సంగీతాన్ని నేర్చుకున్నారు.మొదట్లో ఢిల్లీ( Delhi ) లోని అశోక హోటల్లో పాటలు పాడడం ద్వారా ఆమెకు పాప్ గాయని అనే పేరు వచ్చింది.

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె కలకత్తాకి మారాల్సి వచ్చింది ఇక చివరగా ఆమె చెన్నైలో సెటిల్ అయ్యారు.అయితే మాల్గాడి శుభ( Malgadi shubha ) అనే పేరు రావడానికి మాత్రం కారణం ఏంటంటే 2000 సంవత్సరంలో చిక్‌పక్ చిక్‌భం అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడ వచ్చిన అనే ఒక పాట పాడారు.

ఆ పాట సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె ఇంటిపేరు మాల్గాడిగా స్థిరపడిపోయింది.ఆ రకంగా అందరూ ఆమెను మాల్గాడి శుభ అని పిలవడం మొదలుపెట్టారు.

Advertisement

ఇక మాల్గాడి శుభ ఇంటి నుంచి ఇద్దరు హీరోయిన్స్ సినిమా రంగానికి వచ్చారు.అందులో ఒకరు నార్త్ లో సెటిల్ అయిన విద్య బాలన్ కాగా మరొకరు సౌత్ లో సెటిల్ అయినా ప్రియమణి( Priyamani ).వీరిద్దరూ కజిన్స్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.అయితే మాల్గాడి శుభకు విద్యాబాలన్ కి నేరుగా ఎటువంటి సంబంధం లేదు.

ప్రియమణి మాత్రం మాల్గాడి శుభ యొక్క భర్తకు అక్క కూతురు కావడంతో ఆమెకు మేనకోడలుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇక ప్రియమణి మరియు విద్యాబాలన్( Vidya Balan ) ఇద్దరి మదర్స్ అక్క చెల్లెలు కావడంతో ఆ రకంగా అందరూ వీరిద్దరిని మాల్గాడి శుభ యొక్క మేనకోడల్లే అని అనుకుంటూ ఉంటారు.కానీ శుభకు కేవలం ప్రియమణి తో మాత్రమే రక్త సంబంధం ఉంది.చాలా మంది మాల్గాడి శుభ యొక్క సపోర్ట్ వల్లే ప్రియమైన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అని అనుకుంటారు.

కానీ ఆమె ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.తాను ప్రియమణికి సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సహాయం చేయలేదని, ఆ టైంలో నాకు ఎవరితో పెద్దగా సంబంధాలు ఉండేవి కాదని, పాట పాడటం ఇంటికి వెళ్లడం అంతకు మించి తనకేమీ తెలియదని, అందువల్ల ఎవరికి ప్రియమణి ని పరిచయం చేయలేదని తన సొంత కాళ్లపైనే ఆమె ఎదిగింది అంటూ చెప్పుకొచ్చారు శుభ.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు