విబూదిని ఎలా తయారు చేస్తారో తెలుసా?

విబూది అంటే పాపాలను హరించేది మరియు పవిత్రమైన భస్మం అని అర్ధం.

మనిషి అయినా చెట్టు అయినా కాలితే అయ్యేది భస్మమే కానీ అది నిజమైన విభూది కాదనే చెప్పాలి.

సాధారణంగా గోమయ భస్మాన్నే విబూదిగా చెప్పుతారు.ఆవు పేడను సేకరించి పిడకలుగా చేసి విభూదిని తయారుచేస్తారు.

Making Of Vibhuthi-Making Of Vibhuthi-Devotional-Telugu Tollywood Photo Image

మాస శివరాత్రి రోజు ధాన్యపు పొట్టులోకానీ గడ్డితో కానీ చేసిన అరలలో ఈ పిడకలను పెట్టి వేదమంత్రోఛ్ఛారణ మధ్య కాలుస్తారు.ఈ కాలిన పిడకలు చల్లారిన తర్వాత తడిపి ఆరబెట్టి దిమ్మలుగా తయారుచేస్తారు.

ఈ దిమ్మలనే భక్తులకు విభూది పండ్లుగా అందిస్తారు.ఈ విభూది పండ్లను ఎక్కువగా కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల ఆలయాలలో ఉపయోగిస్తారు.

Advertisement

సాధారణంగా ఈ విభూది దిమ్మలను గుడులకు అనుసంధానంగా ఉన్న గోశాలలో తయారుచేస్తారు.అలాగే రకరకాల ఔషధమొక్కల్ని వాడి చేసే హోమాల నుంచి కూడా విబూదిని సేకరిస్తారు.

హోమ భస్మంలో ఆవుపేడతో పాటు 108 మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి వుంటాయి.ఈ భస్మాన్ని ధరిస్తే అందులో ఉన్న ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి.

విభూదిని ఉంగరపు వేలు, బొటనవేళ్లతో తీసుకోని కనుబొమల మధ్య,గొంతుమీద, ఛాతిమీద ఎక్కువగా ధరిస్తారు.విభూది ధరించటం వలన ఆధ్యాత్మిక భావన పెరగటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

మీ వీర్యం మీ చేతుల్లోనే ఉంది
Advertisement

తాజా వార్తలు