బ్యాక్టీరియా నుంచి సిమెంట్ తయారుచేస్తున్న పరిశోధకులు.. అదెలాగంటే!

ప్రతి నిర్మాణంలో సిమెంట్ వాడకం తప్పనిసరి.అయితే ఎప్పటినుంచో పాత పద్ధతిలోనే సిమెంట్ తయారీ చేస్తున్నారు.

అయితే అధిక డిమాండ్ ఉన్న సిమెంట్ ని కొత్త పద్ధతిలో కూడా తయారు చేయవచ్చని నిరూపించారు పరిశోధకులు.ఐఐటీ మద్రాస్‌ బయోటెక్నాలజీ పరిశోధకులు కొత్త పద్ధతిలో సిమెంట్ తయారు చేశారు.

ఈ కొత్త పద్ధతి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మంచి జరుగుతుంది తాజాగా ఈ పరిశోధన బృందం పేర్కొంది.వివరాల్లోకి వెళితే.

ఐఐటీ మద్రాసు శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా ద్వారా బయోసిమెంట్‌ ఎలా తయారు చేయాలో కనిపెట్టారు.ఈ ప్రక్రియను విజయవంతంగా డెవలప్ చేసినట్లు ఐఐటీ మద్రాస్‌ పరిశోధకుల బృందం శుక్రవారం ప్రకటించింది.

Advertisement

మైక్రోబియల్లీ ఇండ్యూస్డ్‌ కాల్సైట్‌ ప్రిసిపిటేషన్‌ (ఎంఐసీపీ) అనే ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా సాయంతో సిమెంటును తయారు చేయవచ్చని ఐఐటీ మద్రాస్‌ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌ జి.కె.సురేష్‌కుమార్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నీరవ్‌ భట్‌, స్కాలర్‌ శుభశ్రీ శ్రీధర్‌ వివరించారు.ఇప్పుడు తయారుచేసే సిమెంటు కోసం 900 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్ అవసరమని, బయోసిమెంట్‌కు మాత్రం కేవలం 30-40 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్ చాలు అని శాస్త్రవేత్తలు తెలిపారు.

అలాగే ఇది చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో తయారు చేయవచ్చని అని వెల్లడించారు.

కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయి.ఈ ఉద్గారాలు సిమెంటు ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా విడుదలవుతున్నాయి.ఈ నేపథ్యంలో పర్యావరణ హితమైన బయోసిమెంటు ప్రక్రియను ఐఐటీ మద్రాస్ టీమ్ డెవలప్ చేసింది.

అయితే ఈ బయో సిమెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనే దానిపై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది.ప్రస్తుతం పరిశోధన బృందం బయో సిమెంటు దృఢత్వం, సుస్థిరత, నీటి వినియోగం తదితర అంశాలపై దృష్టి సారించింది.

వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..
Advertisement

తాజా వార్తలు