స్కిన్ గ్లో సీరంను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

తమ స్కిన్ అనేది సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతూ కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి.

ఆఫ్ కోర్స్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అటువంటి చర్మం కోసం ఆరాటపడుతుంటారు.

ఈ క్రమంలోనే రకరకాల స్కిన్ గ్లోయింగ్( Glowing Skin ) ప్రొడక్ట్స్ వాడుతుంటారు.వాటికోసం ప్రతి నెల వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

కానీ పెద్దగా ఖ‌ర్చు చేయకుండా ఇంట్లోనే స్కిన్ గ్లో సీరం( Skin Glow Serum ) ను తయారు చేసుకోవచ్చు.ఎటువంటి కెమికల్స్ ఇందులో యూస్ చేయకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు.

మరి ఇంకెందుకు ఆలస్యం సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకోవాలి.అలాగే అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క,( Cinnamon ) పావు టీ స్పూన్ డ్రై రోజ్మేరీ ఆకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై అందులో హాఫ్ టీ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, వ‌న్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది రెడీ అవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజూ నైట్ నిద్రించే ముందు ఈ హోమ్ మేడ్ సీరం ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకునే ముందు చర్మంపై ఎటువంటి మేకప్ ఉండకుండా చూసుకోవాలి.ఇక రెగ్యులర్ గా ఈ సీరంను ఉపయోగించడం వల్ల సహజంగానే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఈ సీరం మీ స్కిన్ కు స్పెషల్ గ్లోను జోడిస్తుంది.అలాగే ముడతలు, చారలు వంటివి ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.

Validation Check 2026
జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

సాగిన చర్మం బిగుతుగా మారుతుంది.నిత్యం ఈ సీరంను వాడ‌టం వల్ల స్కిన్ అనేది హైడ్రేట్ గా ఉంటుంది.

Advertisement

డార్క్ స్పాట్స్ క్రమంగా మాయమవుతాయి.స్పాట్ లెస్ అండ్ షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు