సూర్యుడు ఆశీర్వాదం కావాలంటే సంక్రాంతి రోజు ఈ తప్పు చేయకూడదు?

హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యభగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు.

ఇలా ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించేటప్పుడు సూర్యుడు ముందుగా మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రతి ఒక్కరూ మకర సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ విధంగా సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే కారణంగా సంక్రాంతి పండుగ రోజు పెద్ద ఎత్తున సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.ఈ పండుగ రోజున ఎవరైతే సూర్య భగవానుడి ఆశీర్వాదం పొందుతారో వారిపై ఏ విధమైనటువంటి శనిప్రభావం దోషం కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

ఎంతో పరమ పవిత్రమైన ఈ మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ఆశీర్వాదం మనపై ఉండాలంటే పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు.మరి ఆ పనులు ఏమిటి అనే విషయానికి వస్తే.

మకర సంక్రాంతి సూర్య భగవానుడికి సంబంధించిన పండుగ కావడంతో ఈ రోజు ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడిని దర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి.అంతే కానీ తరువాత స్నానం చేయవచ్చు అని అలాగే భోజనం చేయకూడదు.

Advertisement
Makar Sankranti 2022 Do Not Do These Things-on Makar Sankranti Makara Sankranthi

అదేవిధంగా చాలామంది ప్రతి చిన్న విషయానికి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.అయితే సంక్రాంతి పండుగ రోజు ఇతరులపై ఎలాంటి కోపతాపాలను ప్రదర్శించకూడదు.

Makar Sankranti 2022 Do Not Do These Things-on Makar Sankranti Makara Sankranthi

ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు ఎవరైనా బిచ్చగాళ్లు ఇంటి ముందుకు వచ్చి భవతి బిక్షాందేహి అని అడిగినప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా వారిని చీదరించుకో కూడదు.సంక్రాంతి పండుగ అంటేనే దానధర్మాలకు ప్రతీతి.కనుక ఇంటికి వచ్చిన భిక్షగాళ్లకి తప్పకుండా ఏదో ఒకటి పెట్టి పంపించాలి.

ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగ రోజు పొరపాటున కూడా చెట్లను నరక కూడదు.ఈ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉన్నప్పుడే ఆ సూర్యభగవానుడు ఆశీర్వాదం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు