ఈవారం మహేష్‌ పోవడం ఖాయం, ఎందుకంటే

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ఉన్న కంటెస్టెంట్స్‌లో అధిక ఫాలోయింగ్‌ ఉన్నది శ్రీముఖికి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆమెకు ఫ్యాన్స్‌ సపోర్ట్‌తో పాటు బిగ్‌బాస్‌ డైరెక్టర్స్‌ సపోర్ట్‌ కూడా ఉంది.

అందుకే ఆమె ఫైనల్‌ విజేత అంటూ ముందు నుండే ప్రచారం జరుగుతోంది.ఇక శ్రీముఖి ఫ్యాన్స్‌ తలుచుకుంటే ఎవరినైనా ఎలిమినేట్‌ చేయగలరు అంటూ ఆమె ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈవారం వారు అంతా అనుకుని మరీ మహేష్‌ విట్టాను ఎలిమినేట్‌ చేయబోతున్నారు.

  ఈ వారంలో వరుణ్‌, రాహుల్‌ మరియు మహేష్‌ విట్టాలు ఎలిమినేషన్‌లో ఉన్నారు.ఈ ముగ్గురిలోకి మహేష్‌ విట్టా వీక్‌గా కనిపిస్తున్నాడు.పైగా అతడు గత కొన్నాళ్లుగా ముచ్చట్లు మరీ ఎక్కువ అయ్యాయి.

Advertisement

ఇంట్లో రెండు గ్రూపులు ఉంటే అక్కడి ముచ్చట్లు ఇక్కడ, ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెబుతున్నాడు.దాంతో ఇంట్లో సభ్యుల మద్య గ్యాప్‌ పెరుగుతుంది.

అందుకే మహేష్‌పై ప్రేక్షకుల్లో కూడా కోపం ఉంది.అందుకే ఈ వారం ఆయనుకు ప్రేక్షకులు ఓట్లు వేయడం కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రస్తుతం ఇంట్లో ముగ్గురు లేడీస్‌ శ్రీముఖి, వితిక మరియు శివ జ్యోతిలు ఉన్నారు.అయిదుగురు మగవారు బాబా, అలీ, వరుణ్‌, మహేష్‌, రాహుల్‌లు ఉన్నారు.ఈ ఎనిమిది మందిలో ఈ వారం మహేష్‌ పోతే మరో ఏడుగురు ఉంటారు.

ఆ ఏడుగురిలో రెండు వారాలకు ఒక్కొక్కరి చొప్పున ఎలిమినేట్‌ అయితే మిగిలే చివరి అయిదుగురు ఫైనల్‌ వీక్‌కు వెళ్తారు.ఆ అయిదుగురిలో ఒకరు ఫైనల్‌ విన్నర్‌ అవుతారు.

'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

మరో మూడు వారాల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ముగింపు ఎపిసోడ్స్‌ ప్రసారం కాబోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు