2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్ బిజీ.. ఇలా చేయడం జక్కన్నకు న్యాయమేనా?

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులలో హీరోలే పైచేయి సాధిస్తారు.హీరోలకు ఉన్న క్రేజ్ దర్శకులకు ఉండటం జరగదు.

అయితే రాజమౌళి( Rajamouli ) మాత్రం ఈ విషయంలో మినహాయింపు అనుకోవాలి.దర్శకధీరుడు రాజమౌళికి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే 2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్( Mahesh Babu ) బిజీగా ఉండనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఏకంగా ఐదేళ్ల సమయం కేటాయించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ కు కెరీర్ పరంగా ఐదు సంవత్సరాలు ఎంత ముఖ్యమైన సమయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Rajamouli Combo Movie Updates Create Tension For Fans Details, Mahesh Bab
Advertisement
Mahesh Rajamouli Combo Movie Updates Create Tension For Fans Details, Mahesh Bab

మహేష్ మూవీ విషయంలో ఇలా చేయడం న్యాయమేనా జక్కన్న అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాహుబలి సినిమా( Baahubali ) రెండు భాగాలుగా తెరకెక్కడానికి ఐదేళ్లకు పైగా సమయం పట్టింది.మహేష్ సినిమా విషయంలో సైతం జక్కన్న ఇదే విధంగా చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అక్కర్లేదని చెప్పవచ్చు.

Mahesh Rajamouli Combo Movie Updates Create Tension For Fans Details, Mahesh Bab

మహేష్ రాజమౌళి కాంబో మూవీ( Mahesh Rajamouli Combo Movie ) బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మహేష్ బాబుకు భవిష్యత్తు సినిమాలతో సైతం క్రేజ్ భారీగా పెరగడం పక్కా అని చెప్పవచ్చు.

మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా ఎంతమేర నెరవేరుస్తుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు