సెంటిమెంట్ ని ఒదిలేసిన మహేష్ ?

మహేష్ హీరోగా నటిస్తోన్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా మే నెలలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైన క్రేజీ ప్రాజెక్టుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్ హీరోగా నటిస్తోన్న సినిమా కావడం, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మహేష్‌కి ఓ గుర్తుండిపోయే హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో ‘బ్రహ్మోత్సవం’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో అభిమానులను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది.

Mahesh Leaves Sentiment-Mahesh Leaves Sentiment-Latest News English-Telugu Tolly

గతంలో మే నెలలో విడుదలైన మహేష్ రెండు సినిమాలూ పరాజయం పాలయ్యాయి.మే నెలలో మహేష్ నటించిన ‘నాని’, ‘నిజం’ సినిమాలు విడుదలై మెప్పించలేకపోయాయి.

ఇప్పుడదే నెలలో వస్తోన్న ‘బ్రహ్మోత్సవం’ మాత్రం ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందన్న నమ్మకంతో మహేష్ ఉన్నారు.మంచి కథ, అద్భుతమైన కాస్టింగ్ ఉన్న బ్రహ్మోత్సవం తప్పకుండా అందరినీ అలరిస్తుందని టీమ్ చెబుతూ వస్తోంది.

Advertisement

పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.మే 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కన్నతండ్రి శవం పక్కనే.. ప్రియురాలి మెడలో తాళి కట్టిన కొడుకు.. వీడియో చూస్తే షాక్!
Advertisement

తాజా వార్తలు