అందుకోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను: మహేష్ బాబు

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవలె మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించగా ఆ బాధ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు అని చెప్పవచ్చు.తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానమే పంచుకుంటూ ఉంటాడు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోని విడుదల చేశారు.ఆ వీడియోలో మహేష్ బాబు మంత్రి కేటీఆర్ ను ప్రశంసించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆ వీడియోలో మహేష్ బాబు మాట్లాడుతూ.హైదరాబాదులో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడం గర్వకారణం అని తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు మహేష్ బాబు.అంతేకాకుండా గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని కూడా మహేష్ బాబు అభినందించారు.

ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.అలాగే ఈ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు మహేష్ బాబు.ఇకపోతే మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఏప్రిల్ 28 2023 లో విడుదల కానుంది.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఇప్పటికే రాజమౌళి కథ మొత్తం సిద్ధం చేయగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా పూర్తి అవ్వగానే వెంటనే ఆ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఆ సినిమా ఎలా ఉండబోతోంది?రాజమౌళి మహేష్ బాబును పాన్ ఇండియా స్టార్ గా మార్చబోతున్నాడా ఇలా ఎన్నో రకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

Advertisement