మహేష్ 28 సినిమా టైటిల్ చాలా ఖరీదు.. ఎందుకో తెలుసా!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు 28వ( Mahesh babu ) సినిమా టైటిల్ ను అతి త్వరలోనే రివీల్ చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కృష్ణ జయంతి సందర్భంగా సినిమా యొక్క ఫస్ట్‌ లుక్‌ గ్లిమ్స్( First look glimps ) ను విడుదల చేయబోతున్నారు.

అంతే కాకుండా సినిమా టైటిల్ ( Title )ను కూడా రివీల్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా యొక్క విడుదల విషయంలో మళ్లీ క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.

కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతున్న విషయం తెల్సిందే.కనుక విడుదల తేదీ మారుతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి అనుమానం అక్కర్లేదు అంటూ కొందరు యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది.పలు టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత ఒక టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది.

Advertisement

తీరా సినిమా టైటిల్ ను ఖరారు చేసిన తర్వాత ఆ టైటిల్ ముందే మరో నిర్మాత రిజిస్ట్రర్‌ చేయించారు అంటూ తెలిసిందట.దాంతో వెంటనే ఆ నిర్మాత వద్ద నుండి ఆ టైటిల్‌ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది.

మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ ( Trivikram )సినిమా యొక్క కథ కు ఆ టైటిల్ సరిగ్గా సెట్‌ అవుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి.

టైటిల్ ను ఈనెల 30వ తారీకున రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతానికి టైటిల్ విషయంలో అంతా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అతడు మరియు ఖలేజా సినిమా తర్వాత మహేష్.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు

త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు