మీరు నిజమైన ఛాంపియన్.. అదే మీ గొప్పదనం.. వినేశ్ ఫోగట్ పై మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

వినేశ్‌ ఫొగట్‌( Vinesh Phogat: ).సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈమె పేరు కూడా ఒకటి.

కాగా ఈమె స్టార్ రెజ్లర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఒలంపిక్‌ పతకానికి అడుగుదూరంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన విషయం అందరికీ తెలిసిందే.

కేవలం 100 గ్రాముల అధిక బరువు వల్ల ఆమె ఫైనల్స్‌ లో లేకుండా పోయింది.ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పోరాడిన ఆమెకు పలువురు సెలబ్రిటీలు మద్దతిస్తున్నారు.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలిచి ఆమెకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu ) ఆమెకు మద్దతుగా నిలిచారు.ఈ మేరకు సోషల్ మీడియా( Social media )లో ట్వీట్ చేశారు.

Advertisement

తాజా ఫలితాలతో సంబంధం లేదు.మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే మీ గొప్పతనం.

వినేశ్‌ ఫొగట్‌ మీరొక నిజమైన ఛాంపియన్‌ అని అందరికీ రుజువు చేశారు.మీ ధైర్యం, బలం అందరికీ స్ఫూర్తి.

పతకం వచ్చిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు.మీ స్ఫూర్తి మా అందరిలోనూ ప్రకాశిస్తోంది.

1.4 బిలియన్‌ హృదయాలు మీతోనే ఉన్నాయి అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు.ఇకపోతే ఒలంపిక్స్‌లో తీవ్ర నిరాశ చెందిన వినేశ్‌ ఫొగట్‌ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆమె చివరి క్షణంలో అలా జరగడంతో రెస్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించేసింది.చాలామంది ఈ విషయంలో ఆమె కు మద్దతుగా నిలుస్తూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

మహేష్ బాబు చేసిన పోస్ట్ పై కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు