సర్కారు వారి పాట 100 కోట్లు... మైత్రి వారు చెప్తే నమ్మోచ్చా?

సూపర్ స్టార్‌ మహేష్ బాబుకీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ అయ్యిందంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు.

తమ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 103 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది అంటూ అధికారికంగా పోస్టర్‌ ను విడుదల చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాని ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో విడుదల చేయడం ఇదే ప్రథమం అన్నట్లుగా కూడా వారు పేర్కొన్నారు.ఇండస్ట్రీ ఆల్‌ టైమ్ రికార్డ్‌ అన్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారు.

నిజంగానే రెండు రోజుల్లో అది కూడా వీకెండ్స్ కాకుండా వీక్‌ డేస్ ల్లో వంద కోట్లకు పైగా వసూళ్లు అంటే మామూలు విషయం కాదు.బాలీవుడ్‌ సినిమాలు సైతం కిందా మీద పడుతున్న ఈ సమయంలో కేవలం తెలుగు లో మాత్రమే విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా ఈ స్థాయిలో వసూళ్లు చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమా ప్లాప్‌ అంటూ విరమ్శలు చేస్తున్నారు.ఇప్పుడు అదే మహేష్ యాంటీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో సర్కారు వారి పాట వంద కోట్ల వసూళ్లను ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

మహేష్ బాబు సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది అంటే నమ్మవచ్చు కాని అది మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతుంటే ఎందుకో నమ్మబుద్ది అవ్వడం లేదు అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.ఎవరు ఏం అనుకున్నా కూడా సినిమా కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యం లో ఖచ్చితంగా సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని నమోదు చేసినట్లుగ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు