తేజు డైరెక్టర్‌కు మహేష్ ఆఫర్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌తో మహేష్ ఈ ఏడాదిని ప్రారంభించాడు.

కాగా ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మాత్రం సస్పెన్స్‌గా మారింది.వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు ముందుగా ఒప్పుకున్న మహేష్, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వాయిదా వేశాడు.

ఇక వెంటనే గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన పరశురాంతో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తాడని అందరూ అనుకున్నారు.కానీ ఆ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కే సూచనలు లేవు.

తాజాగా ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా చెప్పిన ఓ స్టోరీలైన్‌కు మహేష్ ఫిదా అయినట్లు తెలుస్తోంది.వెంటనే ఆ స్క్రిప్టును పూర్తి చేయాల్సిందిగా మహేష్ కోరాడట.

Advertisement

కాగా ప్రస్తుతం దేవా కట్టా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇటీవల బాలీవుడ్‌లో ప్రస్థానం రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకోవడంతో ఫుల్ జోష్‌లో ఉన్న దేవా కట్టా, మహేష్‌కు ఎలాంటి కథను వినిపించాడా అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది.

మరి ఈ కాంబోలో సినిమా వస్తుందా లేదా అనేది ఆసక్తికర అంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు